వరస బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న బాలకృష్ణ కొత్త సినిమా 2025 సంక్రాంతి బరిలో ఉంటుందని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ ఉత్సాహం మాములుగా లేదు. పండగ సెంటిమెంట్ ఈసారి కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా టైటిల్ అనౌన్స్ మెంట్ జరగలేదు. ముందు దసరా అన్నారు. మొన్న దీపావళి కూడా అయిపోయింది. అడిగితే నిర్మాత నాగవంశీ అనౌన్స్ మెంట్ వీడియో సిజి వర్క్ కొంచెం పెండింగ్ ఉంది ఇంకో పది రోజులన్నారు. అవి కూడా అయిపోయాయి. కానీ ఎదురు చూస్తున్న కొద్దీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి సౌండ్ వినిపించడం లేదు.
టైటిల్ లీకులు రెండు వారాల క్రితమే వచ్చాయి. డాకూ మహారాజ్, సర్కార్ సీతారామ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు అనఫీషియల్ గా చెప్పారు. కానీ ఏదీ ఖరారు చేయలేదు. ఏంటయ్యా అని కనుక్కుందామని చూస్తే దర్శకుడు బాబీ పండగ డెడ్ లైన్ ని అందుకునేందుకు చాలా కష్టపడుతున్నాడట. నిజానికి డిసెంబర్ రిలీజ్ కే సిద్ధం కావాల్సిన ఫస్ట్ కాపీ ఇప్పుడో నెల వాయిదా పడినా కూడా రెడీ కాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా కొన్ని కీలక భాగాలకు సంబంధించిన షూట్ పెండింగ్ ఉండిపోయిందట. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో పూర్తి చేస్తే టెన్షన్ లేకుండా విడుదల ఉంటుంది.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలతో హ్యాట్రిక్ పూర్తి చేసుకున్న బాలయ్య ఇప్పుడు రెండో రౌండ్ కి రెడీ అవుతున్నారు. దీని తర్వాత అఖండ 2 తాండవం ఇటీవలే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే 109 చిత్రీకరణ అంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ అన్ స్టాపబుల్ 4 కోసం తగినంత సమయం బాలయ్యకు దొరకడం ఆహాకు కలిసి వస్తోంది. టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ ఇలా బోలెడు లాంఛనాలు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా గుమ్మడికాయ కొట్టేసి ప్రమోషన్లు మొదలుపెట్టాలి. బందిపోటు దొంగల బ్యాక్ డ్రాప్ లో ఊర మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా బాలయ్య 109 రూపొందుతోంది.
This post was last modified on November 9, 2024 1:17 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…