దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఆస్వాదించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 కోసం ముంబైలో ఉన్నాడు. వచ్చే జనవరిలోగా తన భాగం మొత్తం పూర్తి చేసేలా దర్శకుడు అయాన్ ముఖర్జీ పక్కా ప్లాన్ తో సిద్ధంగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ప్యాన్ ఇండియా మూవీని త్వరలోనే సెట్స్ కి తీసుకెళ్లాల్సిన నేపథ్యంలో తన 33వ సినిమా దర్శకుడిని తారక్ లాక్ చేసుకున్నాడనే వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఇద్దరు ఇతర బాషల డైరెక్టర్ల (కన్నడ, హిందీ) తో పని చేస్తున్న యంగ్ టైగర్ తాజాగా ఒక తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
అతను నెల్సన్ దిలీప్ కుమార్. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇద్దరి మధ్య పలుదఫాల చర్చలు జరిగి కథ విషయంలో దాదాపు ఏకాభిప్రాయంకు వచ్చారట. ఎన్టీఆర్ స్వంత నిర్మాణ సంస్థతో పాటు మరో భాగస్వామి ఎవరు ఉండాలనే దాన్ని బట్టి ప్రకటన ఉండొచ్చు. అయితే షూటింగ్ గట్రా వివరాలు తెలియడానికి టైం పట్టొచ్చు. ఎందుకంటే తారక్ వార్ 2 తర్వాత నీల్ మూవీ పూర్తి చేయడానికి ఏడెనిమిది నెలలు పడుతుంది. ఆలోగా నెల్సన్ రజనీకాంత్ తో జైలర్ 2 పూర్తి చేసుకుని రావొచ్చు. దానికి ఎక్కువ టైం పట్టదు. సూపర్ స్టార్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం చెన్నైలోనే తీసేలా ప్లాన్ చేస్తున్నారట.
ఈ కాంబో కనక నిజమైతే మాస్ ర్యాంపేజ్ చూడొచ్చు. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకునే క్రమంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 తర్వాత నార్త్ లో తన మార్కెట్ మరింత పెరుగుతుందనే నమ్మకంతో ఉన్నాడు. హృతిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఫైట్లు, డాన్సుల్లో మ్యాచ్ చేసే విధంగా గొప్ప పెర్ఫార్మన్స్ ఇచ్చాడని అంటున్నారు. అయితే దేవర 2 ఎప్పుడు ఉండొచ్చనే దాని గురించి ఇంకా క్లారిటీ రావడం లేదు. కొరటాల శివ కొంచెం బ్రేక్ తీసుకుని స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తాడనే టాక్ ఉంది కానీ ఖచ్చితంగా ఎప్పుడనేది తెలియడానికి టైం పడుతుంది.
This post was last modified on November 9, 2024 2:52 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…