కొన్నిసార్లు పెద్ద సినిమాల లీకుల వల్ల ఏదో జరిగిపోతోందని భయపడతాం కానీ మేలు జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. నిన్న రాత్రి నుంచి పుష్ప 2 ది రైజ్ లో స్పెషల్ సాంగ్ కు సంబంధించిన అల్లు అర్జున్, శ్రీలీల పిక్ ఒకటి ఆన్ లైన్ లో విపరీతంగా వైరలయ్యింది. ఎవరు చేశారు, ఎలా బయటికి వచ్చిందని పట్టించుకునే తీరికలో దర్శకుడు సుకుమార్ లేరు కానీ ఆ ఫోటోని చూశాక అభిమానుల ఉత్సాహం పదింతలు పెరిగినట్టు అయ్యింది. పుష్ప 1లో ఊ అంటావా ఊహు అంటావాకు ఏ మాత్రం తగ్గని రీతిలో సమంతాని మరిపించే స్థాయిలో శ్రీలీల స్టెప్పులు వేసి ఉంటుందనే నమ్మకం ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
ఈ సాంగ్ కు సంబంధించిన హుక్ లైన్ గా ‘దెబ్బలు పడతాయి’ అని చెబుతున్నారు కానీ ఎంతవరకు నిజమో విన్నాకే తెలుస్తుంది. త్వరలోనే దీన్ని వదలబోతున్నారు. కాకపోతే ట్రైలర్ లాంచ్ తర్వాత ఈ పాట వస్తుంది. ఏది ఏమైనా బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాగా ఇలాంటి లీకులు చేసే డ్యామేజ్ కన్నా ఒక్కోసారి హైప్ పెరిగేందుకు ఉపయోగపడతాయి. కాకపోతే ఒక ప్లానింగ్ ప్రకారం అప్డేట్స్ ఇవ్వడానికి సమాయత్తమైన నిర్మాణ సంస్థ వీటి వల్ల కొంచెం అప్సెట్ అయ్యే మాటా వాస్తవమే. ఇంకో మూడు రోజుల పాటు పాట చిత్రీకరణ ఉంటుందని మరో బాలీవుడ్ హీరోయిన్ మెరవొచ్చని వినిపిస్తోంది.
రిలీజ్ డేట్ ముంచుకొస్తుండటంతో పుష్ప 2 టీమ్ ఉరుకులు పరుగుల మీద పనులు పూర్తి చేస్తోంది. ఈ నెల 17 నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు. అయిదు నగరాల్లో భారీ ఈవెంట్లు ఉంటాయి. బన్నీ, రష్మిక మందన్నతో పాటు ఇతర కీలక తారాగణం ఇంటర్వ్యూలు చివరి వారంలో ప్లాన్ చేస్తున్నారు. హైప్ ప్రత్యేకంగా పెంచాల్సిన అవసరం లేకపోయినా బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు పబ్లిసిటీని భారీ ఎత్తున డిజైన్ చేస్తున్నారు. కేరళలో బెనెఫిట్ షో టికెట్లు ఇప్పటికే అమ్మడం మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ చివరి వారం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయి.
This post was last modified on November 9, 2024 11:12 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…