నిన్న విడుదలైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడోకి యునానిమస్ గా డిజాస్టర్ టాక్ వచ్చేసింది. రివ్యూల రేటింగ్ ఏకంగా రెండు లోపలే ఇవ్వడం గత కొన్నేళ్లలో ఇలాంటి పెద్ద బ్యానర్ సినిమాకు ఎప్పుడూ జరగలేదు. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే 18 పేజెస్ యావరేజ్ ఉన్నా దాని కంటెంట్ స్థాయి కన్నా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆడింది. కానీ స్పైకి అలా జరగలేదు. ఫలితం ముందే గ్రహించడంతో పాటు దర్శక నిర్మాతలతో ఉన్న ఇష్యూ వల్ల రిలీజ్ పట్ల అంత ఆసక్తి చూపించకపోయినా థియేటర్లకు తీసుకొచ్చారు. ఊహించినట్టే బొమ్మ బాక్సాఫీస్ వద్ద తిరగబడింది.
ఫ్లాపులు అందరు హీరోలకు వచ్చేవే కానీ నిఖిల్ ఇకపై ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తన చేతిలో ప్యాన్ ఇండియా సినిమాలున్నాయి. కథలు ఒప్పుకునే విషయంలో ఒకటికి రెండు సార్లు అలోచించి అడుగులు వేయాలి. స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో లాంటివి ఆడవని ముందే గుర్తిస్తే స్టోరీ మార్చుకోవడమో దర్శకుడిని ఛేంజ్ చేయడమో ఏదోకటి చేయొచ్చు. అలా కాకుండా చివరి దశలో తప్పెక్కడ జరిగిందో గుర్తించడం వల్ల లాభం లేదు. ఓటిటి డీల్ అవ్వొచ్చు. నిర్మాతలు సేఫ్ అవ్వొచ్చు. కానీ మార్కెట్ పరంగా రెండు ఫ్లాపులు ఒక్కసారిగా ఇమేజ్ ని కిందపడేయకపోయినా బిజినెస్ మీద ప్రభావం చూపిస్తుంది.
స్వయంభు కోసం విపరీతంగా కష్టపడుతున్న నిఖిల్ దాంతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. రామ్ చరణ్ సమర్పణలో రూపొందుతున్న ది ఇండియా హౌస్ సైతం అంతే అంచనాలు మోస్తోంది. ఎంతలేదన్నా ఒక్కోదాని మీద వంద కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. బడ్జెట్ అంత కన్నా ఎక్కువే అవుతోంది. అయినా నిర్మాతలు రిస్క్ చేస్తున్నారంటే కార్తికేయ 2 రూపంలో నిఖిల్ పొందిన గుర్తింపు వల్లే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ప్రమోషన్లు ఏదో మొక్కుబడిగా చేశారు కానీ ఫైనల్ గా రిజల్ట్ మాత్రం ఒక వారమైనా ఆడుతుందా అనిపించేలా నీరసమైన ఓపెనింగ్ తెచ్చుకుంది.
This post was last modified on November 9, 2024 10:45 am
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…