టాలీవుడ్లో మొదటిసారి ఒక కంప్లీట్ మనీ క్రైమ్ ఆధారంగా రూపొందిన లక్కీ భాస్కర్ ఇంకా వంద కోట్ల మైలురాయి అందుకోలేదు. రెండో వారంలో అడుగుపెట్టేనాటికి 74 కోట్లు దాటేసి స్టడీగా ఉంది. నిజానికి దీనికొచ్చిన టాక్, రివ్యూలకు ఈ లాంఛనం ఎప్పుడో మూడు నాలుగు రోజులకే జరిగిపోవాలి. కానీ రెండు స్పీడ్ బ్రేకర్లు అడ్డుగా నిలబడ్డాయి. వాటిలో మొదటిది అమరన్. ఆ ఏముంది అడవి శేష్ మేజర్ లాంటి బయోపిక్కే కదా, అంత గొప్పగా ఆడుతుందాని అనుమానం వ్యక్తం చేసిన అమరన్ అంచనాలని మించి దూసుకుపోవడం ఎవరూ ఊహించలేదు. తమిళ నేటివిటీని ఎమోషన్ డామినేట్ చేయడం వల్ల ఫలితం దక్కింది.
నిర్మాతలు సైతం షాక్ నుంచి కోలుకుని వారం తర్వాత తెలుగులో సక్సెస్ మీట్ పెట్టారు. తర్వాత కిరణ్ అబ్బవరం క పెద్దగా అంచనాలు లేకుండానే అద్భుతాలు చేసింది. ఒకవేళ ఇది ఫ్లాప్ అయ్యుంటే ఇప్పటిదాకా దీని ఖాతాలో పడిన 35 కోట్లకు పైగా గ్రాస్ ఖచ్చితంగా లక్కీ భాస్కర్ కు జమయ్యేది. కానీ ఇది మేజిక్ చేసింది. పలు చోట్ల మాస్ ఆడియన్స్ దుల్కర్ సల్మాన్ కన్నా కిరణ్ అబ్బవరంకే ఓటు వేయడంతో పోటాపోటీగా వసూళ్లు వచ్చాయి. అమరన్ యావరేజ్ అయినా సితార సంస్థ పంట పండేది. మూడింటికి పాజిటివ్ టాక్ రావడంతో మైలురాయి త్వరగా చేరుకోలేదు. కొంచెం టైం పట్టేలా ఉంది.
ఎవరినీ తక్కువంచనా వేయలేమనే దానికి దీపావళి సినిమాల కన్నా వేరే ఉదాహరణ అక్కర్లేదు. ఒక్క బఘీరా మాత్రం ట్రేడ్ ని నిరాశ పరిచింది తప్పించి హిందీ సినిమాలు సింగం అగైన్, భూల్ భూలయ్యా 3లు సైతం మల్టీప్లెక్సుల పుణ్యమాని డీసెంట్ కలెక్షన్లు రాబట్టుకున్నాయి. లక్కీ భాస్కర్ ముందున్న టార్గెట్ వంద కోట్లకు ఇంకెన్ని రోజులు పడుతుందనేది చూడాలి. ఎందుకంటే నవంబర్ 14 ఫైనల్ రన్ వచ్చేస్తుంది. కంగువ, మట్కా, దేవకీనందన వాసుదేవలు వచ్చాక వాటికి థియేటర్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. మెయిన్ సెంటర్స్ తప్ప మిగిలిన చోట్ల లక్కీ భాస్కర్ సెలవు తీసుకోవాలి. చూడాలి ఏం చేస్తాడో.
This post was last modified on %s = human-readable time difference 9:16 pm
మూసీ నది ప్రక్షాళన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నదిని సుందరీకరించి తీరుతామని చెప్పారు.…
డిజాస్టర్ స్ట్రీక్కు తెరదించుతూ ‘క’ మూవీతో మంచి హిట్టే కొట్టాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. మీటర్, రూల్స్ రంజన్…
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ను అనుసరించి.. దేశవ్యాప్తంగా ఎస్సీల…
మొన్నటి ఏడాది సప్తసాగరాలు దాటి సైడ్ ఏబిలో హీరోయిన్ రుక్మిణి వసంత్ కి మన ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు.…
ధర్మవరం పట్టణంలోని చిక్క వడియార్ చెరువును వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆక్రమించారని గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి…
ఇటీవలే జితేందర్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రాకేష్ మాట్లాడుతూ సెలబ్రిటీల కోసం ఎంత ప్రయత్నించినా కుదరలేదని,…