మొన్నటి ఏడాది సప్తసాగరాలు దాటి సైడ్ ఏబిలో హీరోయిన్ రుక్మిణి వసంత్ కి మన ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. సినిమా గొప్ప విజయం సాధించకపోయినా అందులో తన హోమ్లీ లుక్స్ తో పాటు క్యూట్ నటన ఆడియన్స్ కి నచ్చింది. అందుకే తను నటించే చిత్రాల మీద సహజంగానే ఆసక్తి కలిగింది. అయితే సరైన కథల ఎంపిక, ప్లానింగ్ లేకపోతే చేదు ఫలితాలు తప్పవని అమ్మడికి క్రమంగా అర్థమవుతోంది. ప్రశాంత్ నీల్ కథతో రూపొంది ఇటీవలే విడుదలైన ‘బఘీరా’ కన్నడలో ఓ మోస్తరుగా ఆడింది తప్ప మిగిలిన భాషల్లో దారుణంగా బోల్తా కొట్టింది. అసలు ట్రాజెడీ అది కాదు.
సినిమాలో తన పాత్రను ఫస్ట్ హాఫ్ ప్రేమకథకు పరిమితం చేసి రెండో సగంలో మొక్కుబడిగా చూపించి క్లైమాక్స్ లో విలన్ చేతిలో చంపించేశారు. దీంతో ఎలాంటి ప్రభావం లేకుండా క్యారెక్టర్ చప్పగా మిగిలిపోయింది. తాజాగా నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’లో దర్శనమిచ్చింది. బాగా ఆలస్యమైన ప్రాజెక్టు అయినప్పటికి ఎంతో కొంత మ్యాటర్ ఉంటే రుక్మిణికి ఉపయోగపడుతుందని అభిమానులు భావించారు. తీరా చూస్తే ఇది కూడా నిరాశపరిచే రివ్యూలు, టాక్ తో మరో డిజాస్టర్ ఖాతాలో వేసింది. నిఖిల్ హీరో అయినప్పటికీ అసలే మాత్రం బజ్ లేకుండా బలహీనమైన వసూళ్లతో సోసో ఓపెనింగ్ తెచ్చుకుంది.
తర్వాత రుక్మిణి వసంత్ చేయబోయే సినిమా ఏదో కానీ జూనియర్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీలో ఎంపికయ్యిందనే వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతోంది. నిజమా కాదాని మీడియా నేరుగా అడిగితే అటు కాదని చెప్పక ఔననీ చెప్పక మధ్యలో ఊరిస్తోంది. టీమ్ అధికారికంగా ప్రకటించే దాకా తానుగా చెప్పకూడదు కాబట్టి ఇలా తప్పించుకుందేమో. రుక్మిణి వసంత్ మరో సినిమా శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ‘భైరతి రణగల్’. కన్నడతో పాటు తెలుగు తమిళంలో నవంబర్ 15 రిలీజ్ చేయబోతున్నారు. కనీసం ఇదైనా బ్లాక్ బస్టర్ కొట్టి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
This post was last modified on November 8, 2024 3:44 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…