ప్రసిద్ధ జ్యోతిష్యుడు వేణుస్వామి ఇటీవల నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ బంధం గురించి చేసిన కామెంట్స్ వివాదస్పదమైన విషయం తెలిసిందే. 2027లో వారు విడిపోతారంటూ వేణుస్వామి చేసిన జాతక విశ్లేషణ సోషల్ మీడియాలో వైరల్ అయి తీవ్ర విమర్శలకు గురైంది. ఈ వ్యాఖ్యలు పలువురిని ఆగ్రహానికి గురిచేయడంతో, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ కూడా రంగంలోకి దిగింది.
అలాగే పలువురు మహిళా హక్కుల సంఘాలు తెలంగాణ మహిళా కమిషన్‌ను వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ క్రమంలో, మహిళా కమిషన్ గత ఆగస్టులోనే వేణుస్వామిని విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. అయితే, వేణుస్వామి ఈ నోటీసులకు సమాధానం ఇవ్వకూడకుండా కోర్టును ఆశ్రయించి తాత్కాలిక స్టే పొందారు.
కానీ ఇటీవల కోర్టు ఈ స్టేను ఎత్తివేస్తూ వేణుస్వామిని మహిళా కమిషన్ ముందు హాజరుకావాల్సిందిగా తీర్మానించింది. దీంతో తాజాగా మహిళా కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 14న వేణుస్వామిని విచారణకు రావాలని ఆదేశించింది. మరి ఇప్పుడు వేణుస్వామి విచారణకు హాజరవుతారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. వేణుస్వామి నాగచైతన్య, శోభితల భవిష్యత్ గురించి చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి.
ప్రత్యేకించి వేణుస్వామి చేసిన జాతక విశ్లేషణలో “అతను, ఆమె కలిసి ఎక్కువకాలం ఉండరు” అనే విధంగా, విడాకుల అంశాన్ని ప్రస్తావించడం కొందరిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ వ్యాఖ్యలపై బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో వేణుస్వామిపై తీవ్రమైన విమర్శలు, తిట్లు కొనసాగాయి. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విచారణకు రావాలని నోటీసులు పంపినా, ఆయన హాజరు కాకుండా కోర్టు మార్గం ఎంచుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు మహిళా కమిషన్ మరోసారి నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింతగా జనంలో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on November 8, 2024 1:56 pm
వైసీపీ ఎమ్మెల్యేలకు వాయిస్ లేకుండా పోయిందా? ఎక్కడా వారు కనిపించకపోవడానికి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయమే కారణమా? అంటే.. ఔననే అంటున్నారు…
బాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్స్ లో ఒకటిగా విపరీతమైన అంచనాలు మోస్తున్న వార్ 2 ద్వారా జూనియర్ ఎన్టీఆర్ హిందీ తెరంగేట్రం…
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దక్కించుకున్న బీజేపీ కూటమి మహాయుతి సంబరాల్లో మునిగిపోయింది. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు…
2008లో విడుదలైన చిత్రం ‘సిద్దూ ఫ్రమ్ సికాకుళం’ తో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది శ్రద్ధాదాస్. తొలి చిత్రంతోనే యూత్ లో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను అమితంగా ఇష్టపడే యంగ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. అతను సినిమాల్లోకి రాకముందే…
చిన్న ఆర్టిస్టుగా మొదలుపెట్టి సోలో హీరోగా వరస అవకాశాలు చేజిక్కించుకునే దాకా సత్యదేవ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.…