ప్రభాస్ ఏదైనా ప్యాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడంటే దానికి ముందు వెనుకా పోటీ పడేందుకు నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. థియేటర్ల సమస్యతో పాటు ఓపెనింగ్స్ దెబ్బ తింటాయనే ఉద్దేశంతో సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తారు. బాహుబలి నుంచి కల్కి 2898 ఏడి దాకా చూసుకుంటే డార్లింగ్ కి ఏనాడూ కాంపిటీషన్ రాలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10 రిలీజ్ కానున్న ది రాజా సాబ్ కు అలాంటి సీనే ఆశించడం సహజం. కానీ ఈసారి అలా జరిగేలా లేదు. పోటీతో సవాల్ విసిరేందుకు ఇతర హీరోలు రెడీ అవుతున్నారు. వాళ్లలో ముందువరసలో ఉన్నాడు కోలీవుడ్ స్టార్ ధనుష్.
తన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఇడ్లీ కడాయ్ ని ఏప్రిల్ 10 విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఇది రాజా సాబ్ డేట్. అయినా సరే ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడో. నిత్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఇడ్లి కడాయ్ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. ఒక రాత్రి, తెల్లవారుఝామున జరిగే సంఘటనలతో ధనుష్ దీన్ని మొత్తం సింగల్ లొకేషన్ లో షూట్ చేశాడట. కొన్ని ఇతర ప్రాంతాలు ఉంటాయి కానీ స్టోరీ మొత్తం ఒకే చోట జరిగేలా డిఫరెంట్ గా ఉంటుందట. టైటిల్ ని బట్టి చూస్తే ఇదేదో హోటల్ చుట్టూ జరిగే కథలా అనిపిస్తోంది. టీజర్ చూశాక క్లారిటీ రావొచ్చు.
ధనుష్ రావడం వల్ల ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఇబ్బందేం లేదు కానీ తమిళనాడు, కేరళ ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి. ఆ మధ్య రాయన్ ఆశించిన స్థాయిలో లేకపోయినా కమర్షియల్ గా డీసెంట్ సక్సెస్ అందుకుంది. డైరెక్టర్ గా ధనుష్ ఫెయిలవ్వలేదనే కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడీ ఇడ్లి కడాయ్ లో అలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకుంటున్నాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఎమోషనల్ డ్రామాలో భావోద్వేగాలు బలంగా ఉంటాయి. కమర్షియల్ అంశాలు తక్కువగా ఉండే ఇలాంటి సినిమాలు రాజా సాబ్ లాంటి గ్రాండియర్ హారర్ తో తలపడటం విచిత్రమే.
This post was last modified on November 8, 2024 12:15 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…