టాలీవుడ్లో మరోసారి చిన్న సినిమాల జాతరకు రంగం సిద్ధమైంది. ఈ శుక్రవారం ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు రిలీజవుతున్నాయి. అందులో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న సినిమాలు తక్కువే. ఉన్న వాటిలో కొంచెం స్థాయి ఉన్న సినిమా అంటే.. నిఖిల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’నే. నిఖిల్‌కు ‘స్వామి రారా’ లాంటి కెరీర్‌ను మలుపు తిప్పే సినిమాను అందించిన సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.
ఎప్పుడో కొవిడ్ టైంలో మొదలైన ఈ సినిమా పూర్తి కావడం, రిలీజ్ అవ్వడంలో ఆలస్యం అయింది. సడెన్‌గా ఇప్పుడీ చిత్రాన్ని విడుదలక సిద్ధం చేయడంతో అనుకున్న హైప్ రాలేదు. ప్రమోషన్ల పరంగా కూడా పెద్దగా హడావుడి కనిపించలేదు. ఒక ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదీ చిత్రానికి. నిఖిల్, సుధీర్ వర్మలతో పాటు ఇందులో కథానాయికగా నటించిన ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్ సినిమాను కొంతమేర ప్రమోట్ చేశారు.
లో బజ్‌తో రిలీజవుతున్న ఈ సినిమా ట్రైలర్‌తో కొంత ఆకట్టుకుంది. మరి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సర్ప్రైజ్ హిట్ అవుతుందేమో చూడాలి. దీంతో పాటుగా ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో రాకేష్ వర్రె నటించిన ‘జితేందర్ రెడ్డి’ కొంత ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. దివంగత తెలంగాణ స్టూడెంట్ లీడర్ జితేందర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీని ప్రోమోలు ప్రామిసింగ్‌గా కనిపించాయి.
‘ధూమ్ ధామ్’ అనే కామెడీ ఎంటర్టైనర్ కూడా ఈ వారం రేసులో నిలిచింది. చేతన్ మద్దినేని-హెబ్బా పటేల్ ఇందులో జంటగా నటించారు. వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకు హైలైట్‌గా చెబుతున్నారు. మంచు లక్ష్మి ప్రత్యేక పాత్ర పోషించిన ఫాంటసీ మూవీ ‘ఆదిపర్వం’తో పాటు తమిళ అనువాదం ‘బ్లడీ బెగ్గర్’ ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్‌లు.
ఇవి కాక జాతర, రహస్యం ఇదం జగత్, ఈసారైనా, వంచన, జువెల్ థీఫ్ అంటూ ఏవో చిన్నా చితకా సినిమాలు కూడా ఈ వారం రేసులో ఉన్నాయి. మరి రాశిలో ఘనంగా కనిపిస్తున్న ఈ సినిమాల్లో వాసి ఏమాత్రమో చూడాలి.
This post was last modified on November 8, 2024 10:34 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…