ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న నెక్స్ట్ బిగ్ రిలీజ్ అంటే ‘కంగువ’నే. కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో ‘శౌర్యం’ శివ ఈ చిత్రాన్ని రూపొందించాడు. సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా వందల కోట్ల బడ్జెట్ల ఈ సినిమాను రూపొందించాడు. శివ ఇప్పటిదాకా రొటీన్ మాస్ మసాలా సినిమాలే తీశాడు కానీ.. ఈ సినిమా కథాంశం, ప్రోమోల్లో విజువల్స్ చూసి జనాలకు మతి పోయింది. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని, మరో లోకంలోకి తీసుకెళ్తుందని సూర్య ముందు నుంచి ధీమాగా చెబుతున్నాడు.
హైదరాబాద్‌లో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో సైతం సూర్య సినిమా మీద ఎంతో ధీమాను వ్యక్తం చేశాడు. ఈ సినిమా ప్రేక్షకులనే కాక ఫిలిం మేకర్స్‌ను కూడా ఆశ్చర్యపరుస్తుందని.. ఇందులో విజువల్స్‌ను నోరెళ్లబెట్టి చూస్తారని అతను అన్నాడు. అంతే కాక సినిమాలో చాలా సర్ప్రైజులు ఉంటాయని కూడా అతను ప్రేక్షకులను ఊరించాడు.
‘కంగువ’లో సూర్య తమ్ముడు కార్తి కూడా కనిపిస్తాడనే రూమర్ ఉంది. ‘కంగువ’ ట్రైలర్ చివర్లో ఓ షాట్ చూస్తే అదే నిజమనిపించింది. ‘కాష్మోరా’ సినిమాలోని వయొలెంట్ లుక్‌లో కార్తి దర్శనమిస్తాడని అంటున్నారు. మరి సూర్య చెబుతున్న సర్ప్రైజ్ అదేనా.. అంతకుమించి ఏదైనా ఉంటుందా అన్నది చూడాలి. అతను ఒక్కటి కాదు, చాలా సర్ప్రైజులు ఉన్నాయని, ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని అంటున్నాడు. ఈ కామెంట్స్ సినిమా మీద క్యూరియాసిటీని ఇంకా పెంచేవే.
ఇక ‘కంగువ’ ఈవెంట్‌కు హాజరైన రాజమౌళి మీద సూర్య ప్రశంసల జల్లు కురిపించాడు. పాన్ ఇండియా సినిమాలు చేయడానికి సూర్య తనకు ఇన్‌స్పిరేషన్ అని రాజమౌళి అంటే.. ‘కంగువ’ లాంటి సినిమా తీయడానికి రాజమౌళే స్ఫూర్తి అని.. ఆయన రోడ్డు వేస్తే తాము ఆ రోడ్డులో సాగిపోతున్నామని సూర్య అన్నాడు. ఆయన తమ దృష్టిలో ఎవరెస్ట్ లాగా అని అతనన్నాడు. మామూలుగా అందరూ ఫోన్లో స్క్రీన్ సేవర్లుగా తమ కుటుంబ సభ్యుల ఫొటోలు పెట్టుకుంటారని.. కానీ జ్ఞానవేల్ ఎంతో కాలంగా రాజమౌళి ఫొటోనే అలా పెట్టుకున్నాడని సూర్య వెల్లడించడం విశేషం.
This post was last modified on November 8, 2024 10:29 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…