యువ కథానాయకుడు విశ్వక్సేన్ స్టేజ్ ఎక్కాడంటే చాలు ఏదో ఒక కామెంట్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాడు. మీడియా, సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించేలా పేలిపోయే కామెంట్లు చేయడం తనకు అలవాటు. ఆ రకంగానే తన సినిమాలను వార్తల్లో నిలబెడుతుంటాడు. అతను తాజాగా సూర్య సినిమా ‘కంగువ’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యాడు. ఈ వేడుకకు రాజమౌళి సహా ఎంతోమంది అతిరథ మహారథులు హాజరయ్యారు.
ఐతే జక్కన్న తర్వాత స్పీచుల్లో హైలైట్ అయింది విశ్వక్‌దే. అందులో అతను సూర్యను అడిగిన ఓ ప్రశ్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతను తన స్పీచ్ సందర్భంగా సూర్యను ఓ సరదా ప్రశ్న అడిగి ఆడిటోరియంలో నవ్వులు పూయించాడు.
‘సింగం-2’లో వచ్చే ఓ సన్నివేశంలో విలన్ ఇల్లు ఎక్కడా అంటూ సూర్య ఓ మధ్య వయస్కుడిని అడుగుతాడు. దానికాయన ఏమో తెలియదు అంటాడు. ఆవేశంలో ఉన్న సూర్య అతణ్ని పట్టుకుని కొడతాడు. ఈ వీడియో ప్లే చేయించి పాపం అడ్రస్ అడిగితే తెలియదని చెప్పినందుకు అతణ్ని ఎందుకు కొట్టారు సార్ అని విశ్వక్ సూర్యను అడిగాడు. మీరు ఇంత మంచి వాళ్లు, అడ్రస్ అడిగితే కొట్టడమేంటి అని అడిగిన విశ్వక్.. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని తెలుగు ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని అన్నాడు.
దీనికి సూర్య పగలబడి నవ్వుతూ.. సమాధానం చెప్పలేకపోయాడు. దర్శకుడు హరిని అడిగి తెలుసుకుని చెబుతానని అన్నాడు. అనంతరం విశ్వక్ అందుకుని జోకులను పక్కన పెడితే.. సూర్యకు తాను పెద్ద ఫ్యాన్‌ని అని, అప్పట్లో ‘గజిని’ సినిమా చూసి తాను గుండు కొట్టించుకుని సూర్యను అనుకరించినట్లు గుర్తు చేసుకున్నాడు.
This post was last modified on November 8, 2024 10:24 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…