విడాకుల అంశంతో మొదలుపెడితే దాదాపు రెండేళ్ల పాటు సమంత ఎప్పుడూ నెగెటివ్ విషయాలతోనే వార్తల్లో నిలిచింది. ఆమె చివరి సినిమా ‘శాకుంతలం’ పెద్ద డిజాస్టర్ అయింది. తర్వాత అవకాశాలు ఆగిపోయాయి. ఇక వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు, అనారోగ్యం కారణంగా సమంతకు రఫ్ ప్యాచ్ నడిచింది గత రెండేళ్లు.
ఐతే ఎట్టకేలకు మళ్లీ సామ్‌ను ఒక పవర్ ఫుల్ పాత్రలో చూడడం అభిమానులకు నచ్చుతోంది. ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ నిన్న రాత్రే అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవడం మొదలుపెట్టింది.
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన రాజ్-డీకే రూపొందించిన ఒరిజినల్ ఇది. హాలీవుడ్ సిరీస్‌తో ‘సిటాడెల్’తో దీనికి కనెక్షన్ ఉన్నప్పటికీ.. మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేసింది రాజ్-డీకే ద్వయం. ‘ఫ్యామిలీ మ్యాన్’ స్థాయిలో కాకపోయినా ప్రేక్షకులను అలరించేలాగే సిరీస్ రూపొందినట్లు టాక్ వస్తోంది.
ఐతే ‘సిటాడెల్’లో ఏముందన్నది పక్కన పెడితే.. నిన్న ఈ సిరీస్ స్ట్రీమింగ్ మొదలైన దగ్గర్నుంచి సమంత సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. ఆమెకు క్లిప్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులోని ఇంటిమేట్ సీన్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. వరుణ్ ధావన్‌తో ఆమె చేసిన లాంగ్ లిప్ లాక్ సీన్ అయితే తెగ ట్రెండ్ అవుతోంది.
సమంత అందాలను ఎలివేట్ చేసే వేరే సన్నివేశాలకు సంబంధించిన క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. ఈ సిరీస్ చూసిన వాళ్లంతా సమంత కోసమే దీన్ని చూడొచ్చని అంటున్నారు. సిరీస్ కొంచెం లెంగ్తీ, థ్రిల్స్ తగ్గాయి అనే కంప్లైంట్లు ఉన్నప్పటికీ.. యాక్షన్ పాత్రలో సమంత అభినయం, ఆమె చేసిన ఇంటిమేట్ సీన్లు యూత్‌ను బాగానే అట్రాక్ట్ చేస్తున్నట్లున్నాయి.
This post was last modified on %s = human-readable time difference 9:54 pm
ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమనేది అన్ని రంగాల్లోనూ ఉండదు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ లక్షణం అలవర్చుకున్న వాళ్లే గొప్ప…
ఈ రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎలాంటి సినిమాకైనా ప్రమోషన్లు చాలా కీలకం. పెద్ద సినిమాలు రిలీజైనపుడు…
ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా…
ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.…
గత కొన్నేళ్ల నుంచి సోషల్ మీడియాలో ఏవేవో కారణాలతో సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ ఉద్యమాలు చేసే ట్రెండ్ నడుస్తున్న సంగతి…
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు గట్టి ఎదురుదెబ్బ…