దర్శక ధీరుడు రాజమౌళి కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలతో అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘కల్కి’ మూవీలో ఆయన చేసిన క్యామియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తన సినిమాల చివర్లో మెరవడం ఆయనకు అలవాటే. గతంలో ‘అమృతం’ సీరియల్‌లోనూ ఆయన క్యామియో చేశారు.
ఐతే రాజమౌళి వేరే ఓ సినిమాలో కొంచెం లెంగ్త్ ఉన్న క్యామియో చేసిన విషయం జనం మరిచిపోయి ఉంటారు. ఆ చిత్రమే.. మజ్ను. నేచురల్ స్టార్ నాని హీరోగా ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ రూపొందించిన చిత్రమిది. ఈ సినిమా ఆరంభంలో, చివర్లో రాజమౌళి తళుక్కున మెరిశారు. ఈ సినిమా చేసే సమయానికి జక్కన్న ‘బాహుబలి’ షూట్ నడుస్తోంది. ఆయన ఇందులో ఆ సినిమా తీస్తున్న దర్శకుడు రాజమౌళిగానే కనిపించడం విశేషం. నాని తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కనిపిస్తాడు.
ఐతే ఈ చిత్రంలో రాజమౌళితో క్యామియో చేయించాలన్న ఆలోచన దర్శకుడిది కాదట. నానిదేనట. ముందు నాని పాత్రను ఒక సినిమా రైటర్‌గా అనుకున్నామని.. కానీ నానీనే అసిస్టెంట్ డైరెక్టర్ అయితే బాగుంటుందని చెప్పాడని.. అంతే కాక రాజమౌళి దగ్గర ఏడీగా పెడితే బాగుంటుందని కూడా సూచించాడని విరించి వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
తర్వాత నానీనే రాజమౌళితో మాట్లాడి క్యామియో పాత్ర చేయడానికి ఒప్పించినట్లు వెల్లడించాడు. ఆ సమయంలో రామోజీ ఫిలిం సిటీలో ‘బాహుబలి’ షూట్ జరుగుతోందని.. అక్కడికే తాము వెళ్లి సన్నివేశాలు చిత్రీకరించామని.. ఐతే సినిమాలో వాడిన రథాన్ని తమ కోసం ఇవ్వలేని పరిస్థితుల్లో తామే వేరుగా ఓ రథం చేయించి దాంతో ఆ సన్నివేశం చిత్రీకరించామని విరించి వెల్లడించాడు. ఆ సీన్ షూట్ చేస్తున్నపుడు టేక్ ఓకేనా అని రాజమౌళి మళ్లీ మళ్లీ అడిగేవాడని.. కానీ అంత గొప్ప దర్శకుడికి తాను చెప్పడం ఏంటి అని ఆయన చేసింది ఓకే చేసేవాడినని వివరించి తెలిపాడు.
This post was last modified on November 7, 2024 9:48 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…