Movie News

అక్కడ షారుఖ్.. ఇక్కడ సాయిపల్లవి

గత కొన్నేళ్ల నుంచి సోషల్ మీడియాలో ఏవేవో కారణాలతో సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ ఉద్యమాలు చేసే ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిందూ అతివాదులు ఈ రకమైన ట్రెండ్స్ చేస్తూ సినిమా వాళ్లను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టారు కొన్ని సందర్భాల్లో.

ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ సహా కొన్ని చిత్రాలకు ఇలాంటి నెగెటివ్ ట్రెండ్స్ వల్ల బాగా డ్యామేజ్ జరిగింది. గతంలో ఎప్పుడో చేసిన కామెంట్లకు సంబంధించి వీడియోలను పట్టుకొచ్చి సెలబ్రెటీలను ట్రోల్ చేయడం.. అందుకుగాను వాళ్ల సినిమాలను బాయ్‌కాట్ చేయాలని ట్రెండ్ చేయడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.

ఐతే మొదట్లో వీళ్ల ఆటలు బాగానే సాగాయి కానీ.. తర్వాత జనాలకు చిర్రెత్తుకొచ్చి సీన్ రివర్స్ అయింది. ముఖ్యంగా ఈ ట్రెండ్ బ్రేక్ అయింది షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’తో. ఆ సినిమాను కూడా ఓ వర్గం అదే పనిగా టార్గెట్ చేసింది. కానీ అకారణంగా ఈ సినిమాను లక్ష్యంగా చేసుకోవడాన్ని షారుఖ్ ఫ్యాన్స్‌తో పాటు న్యూట్రల్ జనాలు కూడా జీర్ణించుకోలేకపోయారు.

షారుఖ్ మీద ఆ వర్గం వ్యతిరేకత కాస్తా.. మిగతా వాళ్లలో సానుభూతిగా మారింది. దీంతో ‘పఠాన్’ సినిమాకు ఎక్కడ లేని హైప్ వచ్చింది. ఆ సినిమాలో ఉన్న కంటెంట్‌ను మించి అది బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తర్వాత ‘జవాన్’కు కూడా అది కొనసాగి అది కూడా ఘనవిజయాన్నందుకుంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో షారుఖ్ ఫీటే సాయిపల్లవి కూడా రిపీట్ చేసింది. సాయిపల్లవిని కూడా ఇటీవలే ఓ వర్గం ఇలాగే టార్గెట్ చేసింది. ఆమె ఇండియన్ ఆర్మీ, పాకిస్థాన్ ఆర్మీకి పోలిక పెడుతూ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్‌ను తప్పుబడుతూ ఆమె కొత్త చిత్రం ‘అమరన్’ను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిచ్చింది. కొన్ని రోజుల పాటు అదే పనిగా సాయిపల్లవిని ట్రోల్ చేశారు.

తీరా చూస్తే వీళ్ల బాయ్‌కాట్ పిలుపులను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎప్పుడో చేసిన చిన్న కామెంట్‌ను పట్టుకుని ఆమెను ట్రోల్ చేసేసరికి తనపై సానుభూతి వచ్చింది. ‘అమరన్’ సినిమాను అనుకున్న దాని కంటే పెద్ద హిట్ చేశారు. సాయిపల్లవి కోసమే ఈ సినిమాను చాలామంది ఎగబడి చూశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ తనదే. మరెక్కడా కూడా ఈ బాయ్‌క్యాట్ బ్యాచ్ కనీస ప్రభావం కూడా చూపించలేకపోయింది. అమరన్ బ్లాక్ బస్టర్ అయి సాయిపల్లవి మీద జనాల్లో ఎంతమాత్రం నెగెటివిటీ లేదని రుజువు చేసింది.

This post was last modified on November 7, 2024 5:42 pm

Share

Recent Posts

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

1 hour ago

బాలకృష్ణ – తమన్… ఆరేళ్ల నుంచి గ్యాప్ లేదు

బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…

2 hours ago

తెల్లదొరల అరాచకంపై ‘రణబాలి’ రణం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…

3 hours ago

మైక్రోసాఫ్ట్ సహా ఐటీ కంపెనీలకు గ్రీన్ కార్డు షాక్

అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…

3 hours ago

సేనాపతి మీద అభిమానుల భారం

ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…

4 hours ago

అది ప్యారడైజ్ కాకి కాదు

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…

5 hours ago