ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళలో భారీ ఫాలోయింగ్ ఉందనేది అందరికి తెలుసు కానీ పుష్ప 2 ది రూల్ కోసం ఓ పది అడుగులు ముందుకు వేసేలా ఉన్నారు. వాళ్ళ ప్లానింగ్ ఆ స్థాయిలో ఉంది మరి. మల్లువుడ్ లో టాప్ మోస్ట్ సీనియర్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ ని మించిన గ్రాండ్ రిలీజ్ దక్కేందుకు డిస్ట్రిబ్యూటర్ చేస్తున్న ఏర్పాట్లు షాకిచ్చేలా ఉన్నాయి. విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే కేరళలో 55 ఫ్యాన్ షోలకు సెట్టింగ్ జరిగిపోయింది. వీటికి టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టేశారు. తెల్లవారుఝామున 4 నుంచి 7 మధ్యలో వరసగా స్క్రీనింగ్ కాబోతున్నాయి. ఇక్కడితో అయిపోలేదు.
కేవలం లేడీ ఫ్యాన్స్ కోసం కొన్ని ప్రీమియర్లు వేస్తున్నారు. అంటే ఒక్క మగపురుగు కనిపించకుండా కేవలం గర్ల్స్ మాత్రమే ఎంజాయ్ చేసే షోలన్న మాట. కొట్టరక్కారలో ఉన్న మినర్వా ఎంపైర్ థియేటర్లో ఉదయం 7 గంటలకు గర్ల్స్ ఫాన్స్ షో పేరిట ప్రత్యేకంగా ఒక ఆటను ప్రదర్శించబోతున్నారు. అంటే లేడీస్ కు మాత్రమే ఎంట్రీ ఉంటుందని. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ ని బట్టి మరికొన్ని ప్లానింగ్ చేస్తున్నారు. పుష్ప 1 క్లోజింగ్ షేర్ ని మొదటి రోజే దాటేస్తామనే ధీమా అక్కడి బయ్యర్లలో కనిపిస్తోంది. ఈ రేంజులో షోలు వేస్తే ఆల్ టైం రికార్డు నెంబర్లు దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
రోజులు దగ్గరపడే కొద్దీ పుష్ప 2 ఫీవర్ పీక్స్ కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. బయట రాష్ట్రాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఏపీ తెలంగాణలో ఊహించుకుంటేనే మూవీ లవర్స్ టెన్షన్ పడుతున్నారు. టికెట్ రేట్లు, బ్లాక్ టికెట్లు, ఫ్యాన్స్ షోల దందాలు ఒకటా రెండా కల్కి 2898 ఏడి, దేవరలకు ఏ మాత్రం తీసిపోకుండా అల్లు అర్జున్ అరాచకం చేయడం పక్కా అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం దేవిశ్రీ ప్రసాద్ ని తప్పించి తమన్, అజనీష్ లోకనాథ్ తో చేయిస్తున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇంకో నెలరోజులు పుష్ప 2 నామస్మరణే ఉంటుంది.
This post was last modified on November 7, 2024 4:42 pm
తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక…
నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు…
తమ సినిమాల గురించి మేకర్స్ అందరూ ఆహా ఓహో అనే చెబుతుంటారు. రిలీజ్ ముంగిట గొప్పలు పోతుంటారు. కానీ అందరి…
గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం…
రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో…
టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్కు…