సరిగ్గా ఇంకో వారం రోజుల్లో కంగువ విడుదల కానుంది. సూర్య సినిమా అంటే సహజంగానే అంచనాలు ఉంటాయి కానీ ఈసారి కోలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన ప్యాన్ ఇండియా మూవీస్ లో ఒకటి చేయడంతో పరిస్థితి ఎప్పుడు లేనంత తీవ్రంగా ఉంది. టీమ్ చాలా నమ్మకం వ్యక్తం చేస్తోంది. తమిళంతో సమానంగా తెలుగులోనూ వసూళ్ల సునామి ఖాయమనే ధీమాతో ఉంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే తెల్లవారుఝాము నాలుగు గంటల ప్రీమియర్లతో పాటు టికెట్ రేట్ల పెంపు కోసం అప్లికేషన్ పెడుతోంది. తమిళనాడు కంటే ముందే ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ లో బెనిఫిట్ షోలు పడతాయి కాబట్టి టాక్ చాలా కీలకం కానుంది.
ఇప్పటిదాకా వదిలిన ప్రమోషనల్ కంటెంట్ లో ట్రైలర్ బాగుంది కానీ మరీ బాహుబలి రేంజ్ లో స్పందన రాలేదు. మెగా విజువల్ గ్రాండియర్ అనే నమ్మకాన్ని కలిగించగలిగారు. రిలీజ్ కోసం ఇంకో వెర్షన్ కట్ చేసి ఉంటే బాగుండేదన్న కామెంట్ల నేపథ్యంలో టీమ్ ఇంకో రెండు మూడు రోజుల్లో ఆ లాంఛనం పూర్తి చేయబోతోంది. ఇవాళ హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి, బోయపాటి శీను అతిథులుగా వస్తున్నారు. ప్రభాస్ ని ట్రై చేశారు కానీ డేట్ సమస్య వల్ల కుదరలేదని తెలిసింది. ఏదైనా చివరి నిమిషంలో అనూహ్యంగా జరిగితే డార్లింగ్-సూర్య కాంబోని స్టేజీ మీద చూడొచ్చు.
మెడ మీద అంచనాల కత్తిని మోయడం కంగువకు సవాలే. అసలే పోటీ ఉంది. వరుణ్ తేజ్ మట్కా, అశోక్ గల్లాగా దేవకీనందన వాసుదేవ చాలా ధీమాగా పబ్లిసిటీ చేసుకుని నవంబర్ 14నే క్లాష్ అయ్యేందుకు సై అంటున్నాయి. అటుపక్క బాలీవుడ్ లో శబర్మతి రిపోర్ట్ మీద బజ్ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో కంగువకి ఎక్స్ ట్రాడినరీ టాక్ రావాలి. దర్శకుడు సిరుతై శివ ట్రాక్ రికార్డు కన్నా సూర్య ఇమేజ్, భారీ ఖర్చు ఆడియన్స్ ని దీనివైపు చూసేలా చేస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అటవీ నేపధ్యం ఊహించని స్థాయిలో ఉంటాయట. దేవరలాగా ఇది బ్లాక్ బస్టర్ అయితే కంగువ 2 వైపు అడుగులు వేగంగా పడతాయి.
This post was last modified on November 7, 2024 10:18 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…