ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్. ఇది పుష్ప 2 ది రూల్ కు అక్షరాలా వర్తిస్తోంది. విడుదలకు ఇంకా నెల రోజులు ఉండగానే ఓవర్సీస్ లో రికార్డుల ఊచకోత మొదలుపెట్టింది. ఇప్పటిదాకా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 4 లక్షల 10 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసిన పుష్ప 2 మొదటి భాగం ఫుల్ రన్ (4 లక్షల డాలర్లు) ని ఇంత ముందుగా దాటేయడం సరికొత్త రికార్డు. దీన్ని బట్టే బజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఓపెన్ చేసిన రెండు వేల ఏడు వందల యాభై షోల నుంచి నమోదైన డేటా ఇది.
ఏడు వందలకు పైగా లొకేషన్లలో ఇప్పటికే పదిహేను వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా బోలెడు షోలు జోడించాల్సి ఉంది. రోజులు గడిచే కొద్దీ నెంబర్లు షాక్ ఇచ్చే రేంజ్ లో ఉండబోతున్నాయి. ఇంకా చాలా సమయం ఉంది కనక ప్రీమియర్ల క్లోజింగ్ అంకె బయ్యర్ల ఊహకు అందటం లేదు. ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడిలకు దగ్గరగా వెళ్లినా లేదా దాటేసినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదని జోస్యం చెబుతున్నారు. పరిస్థితి చూస్తుంటే అదే జరిగేలా ఉంది. నార్త్ అమెరికాలోనే ఇలా ఉంటె ఇక కెనడా తదితర దేశాల్లో టికెట్ల అమ్మకాలు మొదలైతే జరిగే అరాచకం మాటలకు అందదేమో.
ఇక తెలుగు రాష్ట్రాలలోనూ అలాంటి సీనే రిపీట్ అయ్యేలా ఉంది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి థర్డ్ పార్టీ కొనుగోలుదారులు భారీ మొత్తాలు ఇచ్చి సెంటర్ల వారీగా కొనేసుకుంటున్నారు. ఇది అందరికి లాభదాయకంగా ఉంటోంది. తెల్లవారుఝాము నుంచే షోలు ఉంటాయి కనక దానికి తగ్గట్టే జనం పోటెత్తడం ఖాయం. దేవరని మించిన భీభత్సం అల్లు అర్జున్ చేస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ వచ్చాక నార్త్ నుంచి సౌత్ దాకా పుష్ప 2నే హాట్ టాపిక్ కావడం ఖాయమని యూనిట్ టాక్. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం బాలన్స్ ఉన్న ఐటెం సాంగ్ చిత్రీకరణ ప్లానింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇంకో వారంలోపే అయిపోతుంది.
This post was last modified on November 6, 2024 9:41 am
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…