దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్ స్టార్ తో జట్టు కడుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టుని ఇప్పటికే అధికారికంగా లాంచ్ చేయగా హిట్ 3 ది థర్డ్ కేసులో బిజీగా ఉన్న నాని దాన్ని త్వరగా పూర్తి చేసుకుని ఈ సెట్స్ లో చేరబోతున్నాడు. షూటింగుకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి ప్యారడైజ్ అనే టైటిల్ దాదాపు లాకైనట్టు లేటెస్ట్ అప్డేట్. అనౌన్స్ చేయడానికి ఇంకా టైం ఉంది కాబట్టి అధికారిక ప్రకటన ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు కానీ ఈ పేరు వెనుక మాత్రం ఆసక్తికరమైన లీక్ వినిపిస్తోంది.
దాని ప్రకారం ఈ సినిమా బ్యాక్ డ్రాప్ మొత్తం సికంద్రాబాద్ లో జరుగుతుంది. ఆ మేరకు భారీ సెట్లు కూడా వేశారు. ఎనభై తొంభై దశకం మధ్య జరిగిన ఒక సంచలనాత్మక సంఘటనను ఆధారంగా చేసుకుని శ్రీకాంత్ ఓదెల ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడట. జంట నగరాల్లో కీలకమైన ల్యాండ్ మార్క్ గా చెప్పుకునే ప్యారడైజ్ నేపథ్యంలో కీలకమైన మలుపులు ఉన్నందు వల్లే ఈ టైటిల్ సబబుగా ఉంటుందని భావించి ఆ మేరకు రిజిస్టర్ కూడా చేశారని అంటున్నారు. ఒకవేళ హీరో పేరు ఇదే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని మరో ఇంటరెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మొత్తానికి ఊహలకు భిన్నంగా నాని ఓదెల ఏదో గట్టిగానే ప్లాన్ చేయబోతున్నారు.
బడ్జెట్ సులభంగా వంద కోట్లు దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో బిజినెస్ ని అంతకు మించి చేయాలి. ప్రస్తుతం నాని మార్కెట్ బాగా పెరిగింది. సరిపోదా శనివారం తెలుగులో సత్తా చాటి తమిళంలోనూ డీసెంట్ రన్ దక్కించుకుంది. కంటెంట్ కనక యునివర్సల్ గా ఉంటే ఇతర బాషల ఆడియన్స్ నానిని రిసీవ్ చేసుకుంటారని అర్థమైపోవడంతో దర్శకులు ఆ మేరకు కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్యారడైజ్ కు అనిరుధ్ రవిచందర్ సంగీతం మరో స్పెషల్ అట్రాక్షన్ కానుంది. టీమ్ ఇంకా ధృవీకరించలేదు. జనవరి నుంచి సెట్స్ కి తీసుకెళ్లి వచ్చే ఏడాది చివరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on November 5, 2024 5:00 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…