Movie News

విజయ్ క్రేజ్.. వేరే లెవెల్

తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు అన్నీ కూడా వేరే స్థాయిలో ఉండేవి. అప్పుడప్పుడూ రజినీకి కూడా డిజాస్టర్లు ఎదురైనా.. సరైన సినిమా పడితే బాక్సాఫీస్ మోత మోగిపోయేది. కానీ గత దశాబ్ద కాలంలో ఆయన ఫాలోయింగ్, మార్కెట్ తగ్గుతూ వచ్చాయి. అదే సమయంలో విజయ్ రైజ్ అయ్యాడు. రజినీని మించి మార్కెట్ సంపాదించాడు. గత కొన్నేళ్లలో అతను పట్టిందల్లా బంగారం అవుతోంది.

విజయ్ సినిమాలకు టాక్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ అనిపించుకుంటున్నాయి. లియో, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అందుకు ఉదాహరణ. టాక్ బాలేకున్నా ఇవి వందల కోట్ల వసూళ్లు సాధించి విజయ్ స్టార్ పవర్‌ ఏంటో చూపించాయి. ఐతే ఈ క్రేజ్‌ను రాజకీయంగా ఉపయోగించుకోబోతున్న విజయ్.. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగే ముందు చివరగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

హెచ్.వినోద్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఇటీవలే ఓ సినిమా మొదలైంది. పూజా హెగ్డే అందులో కథానాయిక. ఈ సినిమా షూటింగ్ మొదలైందో లేదో ఓవర్సీస్ థియేట్రికల్ డీల్ పూర్తయిందట. ఏకంగా రూ.78 కోట్లకు ఫార్ ఫిలిమ్స్ సంస్థ అన్ని దేశాలకు సంబంధించిన హక్కులను గుంపగుత్తగా కొనేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఆ సంస్థ మారు బేరానికి ఒక్కో దేశానికి విడిగా హక్కులు అమ్ముకునే అవకాశముంది. అలా ఎంత సంపాదిస్తుందో కానీ.. ఓ సౌత్ రీజనల్ మూవీకి విదేశీ హక్కుల ఇంత రేటు పలకడం అనూహ్యం.

సినిమా ఆరంభ దశలో ఉండగానే.. ఏ టీజర్ కూడా లాంచ్ చేయకుండానే ఇంత రేటు దక్కించుకోవడం చిన్న విషయం కాదు. దీన్ని బట్టే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ ఏ రేంజిలో ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి విజయ్ చివరి చిత్రం ఇదే అని భావిస్తున్నారు. రాజకీయాల్లో ఫలితాలను అనుసరించి విజయ్ మళ్లీ సినిమా చేస్తాడా లేదా అన్నది తేలుతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి రిలీజవుతుందని అంచనా.

This post was last modified on November 5, 2024 2:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago