పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని కీడా కోలా మాత్రమే డైరెక్ట్ చేశాడు. నటుడిగా బిజీగా మారిపోతూ పలు బ్లాక్ బస్టర్లలో భాగం పంచుకుని ఇప్పుడు ఏకంగా సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఏఆర్ సంజీవ్ దర్శకత్వంలో 35 చిన్న కథ కాదు నిర్మాతలు రూపొందిస్తున్న ఎంటర్ టైనర్ కి ఓం శాంతి శాంతి శాంతిః టైటిల్ లాక్ చేసినట్టు సమాచారం. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఖరారైనట్టు తెలిసింది.
దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఇది మలయాళం సూపర్ హిట్ జయ జయ జయ జయహే రీమేక్. పెళ్లయ్యాక కూడా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలనుకున్న అమ్మాయికి భర్తే అడ్డంకిగా మారతాడు. ముందు ఒప్పుకుని తర్వాత ప్లేట్ ఫిరాయించి భార్య మీద పెత్తనం చేయడం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఆసక్తికరమైన సంఘటనలు జరిగి వ్యవహారం చాలా దూరం వెళ్తుంది. ఈగోలు, కోపాలతో ఊగిపోయే జంట మధ్య శాంతి ఎలా ఏర్పడిందనే పాయింట్ తో ఒరిజినల్ వెర్షన్ తీశారు.
గోదావరి బ్యాక్ డ్రాప్ ఎంచుకున్న ఈ పల్లెటూరి డ్రామాలో ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కనక హిట్ అయితే తరుణ్ భాస్కర్ కు మరో ప్రమోషన్ దక్కినట్టే. ఈ నగరానికి ఏమైంది 2 త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్న తరుణ్ భాస్కర్ దీన్ని కూడా ఇదే బ్యానర్ లో చేయబోతున్నట్టు టాక్. మొత్తానికి డైరెక్టర్ గా కన్నా యాక్టర్ గా చాలా బిజీ అవుతున్న ఈ క్రియేటివ్ టాలెంట్ వీలైనంత ఎక్కువ సినిమాలు తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంతేసి గ్యాప్ తో ఆలస్యం చేస్తే ఎలానే వాళ్ళ ప్రశ్న సబబే. ఓం శాంతి శాంతి శాంతిః కనక పెద్ద సక్సెస్ అయితే నటుడిగా ఇంకెంత బిజీగా మారిపోతాడో.
This post was last modified on November 5, 2024 2:53 pm
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…