కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత అర్థాలు వచ్చి ట్రోలింగ్ కే దారి తీయొచ్చు. కానీ పరిణితితో హ్యాండిల్ చేస్తే ఎవరైనా సరే మౌనంగా ఉండిపోతారని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. ఇటీవలే కంగువ ప్రమోషన్ కోసం సూర్య బెంగళూరు ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఇందులో ఒక జర్నలిస్టు ఘాటైన క్వశ్చన్ అడిగాడు. ముందు అక్టోబర్ 10 రిలీజ్ ప్లాన్ చేసుకుని రజనీకాంత్ వేట్టయన్ కోసం వాయిదా వేసుకున్న మీరు, నవంబర్ 14 వస్తున్న శాండల్ వుడ్ స్టార్ శివరాజ్ కుమార్ భైరతిరణగల్ ని లెక్క చేయలేదా అంటూ నిలదీశాడు.
కంగువకు కర్ణాటకలో ఎన్ని స్క్రీన్లు వస్తాయో అంతే సంఖ్యలో శివన్న సినిమాకు తమిళనాడులో కేటాయిస్తారా అంటూ మరో లాజిక్ లేవనెత్తాడు. సావధానంగా విన్న సూర్య కూల్ గా బదులిస్తూ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ ఇవన్నీ నటనతో సంబంధం లేని వేర్వేరు ప్రపంచాలని, ఒకవేళ తనకు ఏ మాత్రం అవకాశం లభించినా ఇలాంటి విషయాల పట్ల గొంతు కలిపేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పడమే కాక, ఎంతో ఇష్టమైన శివన్న కోసం దేనికైనా రెడీ అంటూ సంకేతం ఇచ్చాడు. కొంచెం ఆవేశం కలగలసిన గొంతుతో ఆ విలేఖరి నిలదీసినంత పని చేస్తే సూర్య హ్యాండిల్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది.
ఇదే కాదు గతంలో పుష్ప 1 ది రూల్ ఈవెంట్ కు అల్లు అర్జున్ కొంచెం ఆలస్యంగా వస్తే కన్నడ మీడియా ప్రతినిధి ఒకరు మోతాదుకి మించి నిలదీశాడు. దానికి బన్నీ కారణాలు వివరించి సారీ కూడా చెప్పాడు. ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళ సినిమాల పెర్ఫార్మన్స్ కొందరికి కంటగింపుగా మారింది. కెజిఎఫ్, కాంతార తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్యాన్ ఇండియా సక్సెస్ ఇతర భాషల్లో వచ్చాయి కానీ కన్నడలో లేవు. పైపెచ్చు కబ్జా, మార్టిన్ లాంటివి ట్రోలింగ్ కు గురైతే బఘీరా ఘోరంగా డిజాస్టరయ్యింది. అందుకే ఈ అసహనమోనని నెటిజెన్ల కామెంట్. అయినా కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం ఏముంది.
This post was last modified on November 5, 2024 4:05 pm
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…