తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాస్ అధికారికంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం. అనూహ్యంగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. సంక్రాంతికి రావాలని అభిమానులు కోరుకుంటే పోటీ దృష్ట్యా అనవసరంగా ఓపెనింగ్స్ దెబ్బ తీసుకోవడం ఇష్టం లేని గీత ఆర్ట్స్ నాగచైతన్య కెరీర్ లో మొదటి ప్యాన్ ఇండియా సినిమాకు మంచి వెల్కమ్ దక్కేలా ప్లాన్ చేసుకుంటోంది. జనవరి చివరి వారం ఒక ఆప్షన్ పెట్టుకున్నప్పటికీ పలు కారణాల దాన్ని కాదనుకుని మరుసటి నెలకు షిఫ్ట్ అయ్యారు.
ఇదిలా ఉండగా ఇదే ఫిబ్రవరిలో కుబేర రావొచ్చని తాజా లీక్. ధనుష్ హీరో అయినప్పటికీ నాగార్జున కీలక పాత్ర పోషిస్తుండటంతో మల్టీస్టారర్ లుక్ వచ్చేసింది. లీడర్ తర్వాత శేఖర్ కమ్ముల తీసుకున్న సీరియస్ సబ్జెక్టు ఇదే. ఒక బిచ్చగాడు వ్యవస్థను శాశించే శక్తిగా ఎలా మారాడనే పాయింట్ తో రూపొందిందని సమాచారం. ఆ నెల 14 లేదా 21 రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. తండేల్ 7 వస్తుంది కాబట్టి తండ్రి కొడుకుల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండటం అవసరం. అదే నిజమైన పక్షంలో 21 బాగుంటుంది. ఇంకా లాక్ చేయలేదు.
ఈ నెల పదిహేనో తేదీ జరగబోయే టీజర్ లాంచ్ లో దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు. ఇప్పటికే కొంచెం లేట్ అయిన కుబేర మీద భారీ బడ్జెట్ పెట్టారు. రష్మిక మందన్న హీరోయిన్ కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఊహించని ట్విస్టులతో శేఖర్ కమ్ముల స్క్రీన్ ప్లే షాక్ ఇచ్చేలా ఉంటుందని వినికిడి. తండేల్ నిర్ణయం విన్న తర్వాత కుబేరను ఎప్పుడు లాక్ చేయాలనేది డిసైడ్ చేయొచ్చు. చైతు ఫిబ్రవరి అంటేనే ఫీలవుతున్న ఫ్యాన్స్ ఒకవేళ నాగార్జున కూడా సేమ్ అంటే ఇంకెలా తీసుకుంటారో. మార్చి వైపు చూడొచ్చు కానీ శివరాత్రి దాకా ఆగాల్సి ఉంటుంది. కానీ ఆ స్లాట్ లో తమ్ముడు, హరిహర వీరమల్లు, ఎల్ 2 ఎంపూరన్ ఉన్నాయి.
This post was last modified on November 5, 2024 1:46 pm
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…