యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం టాప్ హిట్స్ లో చోటు దక్కించుకున్న దేవర పార్ట్ 1 థియేటర్ రిలీజ్ జరుపుకున్న నలభై రెండు రోజుల తర్వాత ఓటిటిలో వచ్చేస్తోంది. నిజానికి ఎనిమిది వారాల తర్వాత కానీ రాదనే ప్రచారం తొలుత జరిగింది. కానీ నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం నెలన్నరలోపే రాసుకోవడంతో అభిమానులు ఊహించిన దానికన్నాముందుగానే డిజిటల్ లో వచ్చేస్తోంది. ఏడో తేదీ అర్థరాత్రి నుంచే చూసుకోవచ్చు. అఫీషియల్ గా నెట్ ఫ్లిక్స్ యాప్ లో ఈ శుక్రవారమే స్ట్రీమింగ్ కాబోతున్నట్టు చెప్పడంతో డౌట్లు తీరిపోయాయి.
ఇంత పెద్ద హిట్టు కనీసం యాభై రోజుల తర్వాత ఓటిటికి వచ్చి ఉండాల్సిందనే కామెంట్స్ ఉన్నాయి కానీ ప్రాక్టికల్ గా చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. దేవర ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది. మెయిన్ సెంటర్స్ లో 50 రోజులు ఆడటం ఖరారయ్యింది కానీ మిగిలిన చోట్ల కొత్త సినిమాల వల్ల తీసేశారు. దసరా, దీపావళికి బోలెడు రిలీజులు ఉండటం వల్ల స్క్రీన్ల సర్దుబాటు కోసం దేవరకు సెలవు ఇచ్చేశారు. పైగా మొదటి మూడు వారాల్లోనే లాభాల్లోకి తీసుకొచ్చిన దేవర ఆపై నెమ్మదించినా, రన్ లేకపోయినా నష్టమేమీ లేదు. కాకపోతే గతంలో హనుమాన్, ఆర్ఆర్ఆర్ లాంటివి ఫిఫ్టీ డేస్ తర్వాతే ఓటిటికి వచ్చాయి.
నెట్ ఫ్లిక్స్ సంస్థ దేవర వ్యూస్ మీద భారీ అంచనాలతో ఉంది. ఇప్పటిదాకా ఆ ప్లాట్ ఫార్మ్ లో రికార్డులు సృష్టించిన ఆర్ఆర్ఆర్, గంగుబాయ్ కటియావాడి, మహారాజ్, గుంటూరు కారం మైలురాళ్ళను దాటుతుందనే నమ్మకంతో ఉంది. దాన్ని బట్టే దేవర 2 అంతకన్నా పెద్ద మొత్తంతో సొంతం చేసుకోవడానికి దారి సుగమం అవుతుంది. ఆల్రెడీ చూసినవాళ్ళైనా సరే దేవర విశ్వరూపం, అనిరుధ్ రవిచందర్ సంగీతం కోసం మళ్ళీ షోలు వేసుకోవడం ఖాయం. దేవరతో పాటు నవంబర్ 8న రజనీకాంత్ వెట్టయన్ ది హంటర్ (అమెజాన్ ప్రైమ్), టోవినో థామస్ ఏఆర్ఎం (డిస్నీ హాట్ స్టార్) ఒకేసారి రాబోతున్నాయి.
This post was last modified on November 5, 2024 11:19 am
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…