Movie News

తొమ్మిది సినిమాల జాతర ఉంది కానీ

నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్ కి ఏమంత జోష్ ఇచ్చేలా లేదు. దీపావళికి వచ్చిన లక్కీ భాస్కర్, క, అమరన్ మూడు స్టార్ పవర్ మీద కాకుండా కంటెంట్ తో జనాన్ని మెప్పించడంతో సూపర్ హిట్ దశని దాటి బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తున్నాయి. వీటి జోరు సెకండ్ వీక్ లోనూ కొనసాగుతుందనే అంచనాలున్న నేపథ్యంలో కొత్త రిలీజుల పట్ల బజ్ లేకపోవడం బయ్యర్లలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఉన్నంతలో జనం దృష్టిలో పడే అవకాశం ఉన్న వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.

షూటింగ్ ఎప్పుడు జరిగిందో ఎంత టైం పట్టిందో తెలియకుండానే హఠాత్తుగా ఊడిపడటంతో ఆఘమేఘాల మీద ప్రమోషన్లు చేస్తున్నారు. నిఖిల్, సుధీర్ వర్మలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తి పుట్టించేలా చేస్తున్నాడు. నవంబర్ 8 వస్తున్న వాటిలో ఇదే కొంచెం అడ్వాంటేజ్ ఉన్నది. మిగిలిన లిస్టు చూసుకుంటే ధూమ్ ధామ్, జితేందర్ రెడ్డి, జాతర, ఈసారైనా, రహస్యం ఇదం జగత్, వంచన, జ్యూయల్ థీఫ్ ఉన్నాయి. వీటిలో రెండు మూడు పబ్లిసిటీ పరంగా శ్రద్ధ తీసుకుంటున్నాయి కానీ ఓపెనింగ్స్ రావడం అనుమానమే. పబ్లిక్ టాక్ అనూహ్యంగా ఉంటే తప్ప థియేటర్లకు పబ్లిక్ ని లాగడం డౌటే.

ఒక రోజు ముందు ఏడో తేదీ తమిళ డబ్బింగ్ బ్లడీ బెగ్గర్ ని సురేష్ – ఏషియన్ సంస్థలు సంయుక్తంగా తీసుకొస్తున్నాయి. కెవిన్ హీరోగా నటించగా జైలర్ దర్శకుడి నెల్సన్ దిలీప్ కుమార్ ప్రొడక్షన్ లో రూపొందింది. గత వారం తమిళంలో రిలీజై డీసెంట్ రివ్యూస్, టాక్ దక్కించుకున్న నేపథ్యంలో మన ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో. లెక్క చూసుకుంటే తొమ్మిది దాకా ఉన్నాయి కానీ ఏవి మెప్పిస్తాయో చూడాలి. వారం గ్యాప్ లో నవంబర్ 14న సూర్య కంగువ, వరుణ్ తేజ్ మట్కా, అశోక్ గల్లా దేవకీనందన వాసుదేవ వస్తున్న నేపథ్యంలో మొదటి వారం పైన చెప్పిన తొమ్మిది సినిమాలకు కీలకం కానుంది.

This post was last modified on November 4, 2024 5:34 pm

Share

Recent Posts

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…

4 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

23 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

56 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago