నిన్న జరిగిన లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీని ఉద్దేశించి దిల్ రాజు ఒక మాటన్నారు. తనను తాను వంశీలో చూసుకున్నట్టు ఉందని, ఇప్పుడు నేను ట్రాక్ తప్పినా అతను హిట్స్ లో ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎలాంటి భేషజం లేకుండా ఇంత ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇవ్వడం అరుదు. ఇందులో అబద్దం లేదు. ఎందుకంటే ది ఫ్యామిలీ స్టార్ లాంటి పెద్ద సినిమాతో మొదలుకుని జనక అయితే గనక లాంటి చిన్న బడ్జెట్ చిత్రం దాకా దిల్ రాజు జడ్జ్ మెంట్లు లెక్క తప్పుతున్నాయి. విపరీతమైన నమ్మకం పెట్టుకున్నవన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లయ్యాయి.
2025 నుంచి దిల్ రాజు కొత్త ఇన్నింగ్స్ అది కూడా ట్వంటీ 20 వేగంతో మొదలుపెట్టబోతున్నారు. జనవరి 10 రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తో దానికి శ్రీకారం చుట్టబోతున్న సంగతి తెలిసిందే. మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా గ్రాండియర్ కోసం ఆయన పెట్టిన పెట్టుబడి మీద లెక్కేసే వడ్డీలతోనే ఇంకో పెద్ద సినిమా తీయొచ్చు. అయినా సరే దర్శకుడు శంకర్, రామ్ చరణ్ మీద నమ్మకంతో రిస్కుకు సిద్ధపడ్డారు. కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలో వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బరిలో దిగుతోంది. ఇన్ సైడ్ రిపోర్ట్స్ అయితే నవ్విస్తూ పొట్టచెక్కలయ్యే ఎంటర్ టైనర్ గా చెబుతున్నాయి.
నెల తిరగడం ఆలస్యం మహాశివరాత్రికి నితిన్ ‘తమ్ముడు’ని సిద్ధం చేయబోతున్నారు. ఇవాళ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. ఇది కూడా ఆలస్యమవుతూ వచ్చిన ప్రాజెక్టే. దర్శకుడు వేణు శ్రీరామ్ మీద కాన్ఫిడెన్స్ తో ఖర్చుకు వెనుకాడలేదు. ఫిబ్రవరి చివరి వారంలో థియేటర్లకు తీసుకొస్తారు. ఈ మూడు సినిమాలను కలుపుకుంటే వీటి మీద దిల్ రాజు చేయబోయే థియేట్రికల్ బిజినెస్ అటుఇటుగా అయిదారు వందల కోట్లను సులభంగా దాటేస్తుంది. ఇవి కనక సక్సెస్ అయితే తాను ఏదైతే ట్రాక్ తప్పానని చెప్పుకుంటున్నారో తిరిగి అదే ట్రాక్ మీద గర్వంగా పరుగులు పెట్టే టైం వచ్చేస్తుంది.
This post was last modified on November 4, 2024 5:21 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…