మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క దర్శనం జరిగి ఏడాదికి పైగానే అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్లలో స్వీటీ నేరుగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఒకటి రెండు వీడియోలతో ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది తప్ప షూట్ చేసిన ఇంటర్వ్యూ సైతం ఎందుకో స్ట్రీమింగ్ జరగలేదు. ఏదైతేనేం సూపర్ హిట్ దక్కిన ఆనందం అభిమానులకు మిగిలింది.
తర్వాత అనుష్క వైపు ఎలాంటి అప్డేట్స్ లేకుండా పోయాయి. ఏ సినిమా చేస్తుంది, కాంబినేషన్ లాంటి వివరాలు చాలా రోజులు బయటికి రాలేదు. కానీ తెలుగు, మలయాళం కలిపి తను రెండు కమిట్మెంట్లు ఇచ్చిన సంగతి కొన్ని నెలల క్రితం రివీలయ్యింది.
వాటిలో మొదటిది క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఘాటీ. హరిహరవీరమల్లు ఆలస్యం అవుతుండటంతో దాన్నుంచి తప్పుకుని క్రిష్ ఈ ప్రాజెక్టు మీద ప్రత్యేక్ష శ్రద్ధతో పని చేశాడు. గతంలో ఈ కాంబోలో వేదం వచ్చింది. అనుష్క కెరీర్ లో వేశ్యగా నటించిన ఏకైన సినిమా ఇది. అంతే పేరు తీసుకొచ్చింది కూడా.
ఇప్పుడు ఘాటీలో అంతకు మించి పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రను డిజైన్ చేశాడని టాక్. ఒక ఒంటరి మహిళ అతి పెద్ద నేర సామ్రాజ్యంలోకి ప్రవేశించడమే కాక అక్కడ ఆధిపత్యం చెలాయించడమనే పాయింట్ చుట్టూ ఘాటీ నడుస్తుందట. నవంబర్ 7 అనుష్క బర్త్ డేకి ఫస్ట్ లుక్ వదలబోతున్నారు.
కథనర్ – ది వైల్డ్ సార్సరర్ అనే పీరియాడిక్ మల్లువుడ్ మూవీలో అనుష్క కలియన్ కట్టు నీలిగా కనిపించబోతోంది. దీనికి సంబంధించిన స్టిల్ కూడా పుట్టినరోజు వదలబోతున్నారని సమాచారం. జయసూర్య హీరోగా నటించిన ఈ భారీ చిత్రం స్వంతంగా సెటప్ చేసుకున్న స్టూడియోలో వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని వాడి షూట్ చేశారు. బడ్జెట్ కూడా భారీగానే అయ్యింది.
తొమ్మిదో శతాబ్దానికి చెందిన క్రిస్టియన్ యోధుడి కథ ఆధారంగా కథనర్ రూపొందింది. ఈ సినిమాతో పాటు ఘాటీ రెండూ వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి. రిలీజ్ డేట్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఏమైనా వస్తుందేమో చూడాలి.
This post was last modified on November 4, 2024 1:20 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…