ప్రస్తుతం సినిమాల స్కేల్ పరంగా ప్రభాస్‌ను అందుకునే హీరో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు. బాహుబలితో ఎవ్వరికీ సాధ్యం కాని స్థాయిని అందుకున్న అతను.. వరుసగా భారీ చిత్రాలే చేస్తున్నాడు. మధ్యలో కొన్ని సినిమాలు పోయినా.. సలార్, కల్కి చిత్రాలతో తన రేంజ్ ఏంటో చూపించాడు.
ఇప్పుడు రాజా సాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇంకా తన చేతిలో స్పిరిట్, సలార్-2, కల్కి-2 లాంటి మెగా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికే చాలా టైం పట్టేలా ఉంది. నాలుగేళ్ల పాటు మరో సినిమా ఓకే చేసే పరిస్థితి కనిపించడం లేదు. కానీ ప్రభాస్ కొత్త ప్రాజెక్టుల గురించి ఊహాగానాలు మాత్రం ఆగట్లేదు. ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్ తెరపైకి వస్తోంది.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో ప్రశాంత్ వర్మ చేయాలనుకున్న ‘బ్రహ్మ రాక్షస’ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఆగిపోయింది. ఈ కథనే ప్రభాస్‌తో చేయడానికి ప్రశాంత్ రెడీ అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్ర పట్ల ప్రభాస్ ఆసక్తిగా ఉన్నాడంటున్నారు. ఈ సినిమాను త్వరలో ప్రకటించవచ్చని ప్రచారం సాగుతోంది. కానీ ‘హనుమాన్’తో తనపై అంచనాలు పెరిగాక ప్రశాంత్ ఎప్పటికప్పుడు కొత్త సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తున్నాడు కానీ.. వీటిలో ఏది పట్టాలెక్కుతుందో అర్థం కాకుండా ఉంది. కాబట్టి ‘బ్రహ్మరాక్షస’ ప్రభాస్‌తో నిజంగా ఉంటుందా అని కచ్చితంగా చెప్పలేం.
ఇదిలా ఉంటే ‘ఆదిపురుష్’తో తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిన ఓం రౌత్‌తో ప్రభాస్ మళ్లీ జట్టు కట్టబోతున్నాడని తాజాగా ఓ రూమర్ బయటికి వచ్చింది. ఓం ఈసారి బాగా టైం తీసుకుని మంచి సబ్జెక్ట్ రెడీ చేశాడని.. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో చేయాలనుకుంటున్నాడని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ‘ఆదిపురుష్’ అనుభవం తర్వాత ప్రభాస్ మళ్లీ ఓంతో జట్టు కట్టే సాహసం చేస్తాడా అన్నది డౌట్.
This post was last modified on November 4, 2024 10:22 am
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…