యువ కథానాయకుడు నిఖిల్ నుంచి ఇప్పుడో సర్ప్రైజింగ్ మూవీ రాబోతోంది. అదే.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. సుధీర్‌తో ‘స్వామి రారా’, ‘కేశవ’ చిత్రాలు తీసిన సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు పూర్తయిందో తెలియిదు. సడెన్‌గా ఫస్ట్ లుక్ లాంచ్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. దీపావళికే అనుకున్న ఈ సినిమాను నవంబరు 8కు మార్చారు.
ఈ సినిమా పట్ల నిఖిల్‌కు పెద్దగా ఆసక్తి లేదని, దీని మీద తనకు నమ్మకం కూడా లేదని వార్తలు వచ్చాయి. కానీ అదంతా ఉత్త ప్రచారమే అని తేలిపోయింది. నిఖిల్ చక్కగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టేశాడు. సినిమా గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు. తన ఫ్రెండే అయిన దర్శకుడు చందూ మొండేటి, సుధీర్ వర్మలతో కలిసి ఓ ఇంటర్వ్యూలోనూ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా నిఖిల్‌తో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ జనాల దృష్టిలో ఈ సినిమా మీద ఉన్న అనుమానాలు తీర్చేందుకు ఒక ప్రశ్న అడిగాడు చందూ. “అసలీ సినిమా ఎప్పుడు చేశార్రా” అని నిఖిల్‌ను చందూ అడిగాడు. అందుకు నిఖిల్ బదులిస్తూ.. ‘కార్తికేయ-2’ సినిమా చేస్తున్నపుడు చివర్లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టినట్లు వెల్లడించాడు. కొవిడ్ టైంలో సినిమా షూట్ జరిగిందని.. కొన్ని కారణాల వల్ల రిలీజ్ ఆలస్యం అయిందని చెప్పాడు.
‘పుష్ప’ సహా పలు చిత్రాలకు రచయితగా పని చేసిన శ్రీకాంత్ విస్సా ఈ మూవీకి కథ అందించాడని.. సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయని.. తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేరని.. క్లైమాక్స్ అయితే అస్సలు గెస్ చేయలేరని నిఖిల్ తెలిపాడు. ప్రతిసారీ పెద్ద స్పాన్‌లో కార్తికేయ-2, స్వయంభు లాంటి సినిమాలు చేయలేమని.. అప్పుడప్పుడూ కాన్సెప్ట్ బేస్డ్‌గా నడిచే ‘అప్పుడో ఇప్పుడు ఎప్పుడో’ లాంటి కొత్త సినిమాలు కూడా చేయాలని.. ఈ చిత్రం మీద తాను ఎంతో నమ్మకంగా ఉన్నానని నిఖిల్ తెలిపాడు.
This post was last modified on November 4, 2024 10:18 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…