సౌత్ సినిమా నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ రిలీజ్ అంటే.. ‘కంగువ’నే. తమిళ టాప్ స్టార్లలో ఒకడైన సూర్య ప్రధాన పాత్రలో ‘శౌర్యం’ శివ రూపొందించిన చిత్రమిది. సూర్య కెరీర్‌కు పెద్ద మలుపుగా నిలుస్తుందని ఈ చిత్రంపై అంచనాలున్నాయి. సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా వందల కోట్ల బడ్జెట్ పెట్టి ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం క్రేజీ టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది.
సూర్యకు తెలుగులో కూడా బంపర్ క్రేజ్ ఉండడంతో ‘కంగువ’ను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈసినిమాకు హైప్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి ‘కంగువ’కు అర్ధరాత్రి, తెల్లవారుజామున స్పెషల్ షోలు వేస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ‘కంగువ’ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ‘కంగువ’ స్పెషల్ షోలపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
‘కంగువ’ చిత్రానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో తెల్లవారుజామున 4 గంటలకు స్పెషల్ షోలు వేయబోతున్నామని స్టూడియో గ్రీన్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ పెట్టారు. ఐతే తమిళనాడులో తెల్లవారుజామున షోలను నిషేధించిన సంగతి తెలిసిందే.
స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ షోలకు అనుమతి ఇవ్వడం లేదు. కానీ దీని మీద ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి వినతులు వెళ్తూనే ఉన్నాయి. త్వరలో పరిస్థితి మారొచ్చని భావిస్తున్నారు. తమిళ స్టార్ హీరోల ఫ్యాన్స్ రాష్ట్రం దాటి వెళ్లి బోర్డర్లోని వేరే రాష్ట్రాల్లో స్పెషల్ షోలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కంగువ’ స్పెషల్ షోల కోసం ప్రభుత్వానికి విన్నవించామని.. త్వరలో సానుకూల వార్త వస్తుందని భావిస్తున్నామని స్టూడియో గ్రీన్ సంస్థ పేర్కొంది. ‘కంగువ’కు ఏపీ, తెలంగాణల్లో కొన్ని థియేటర్లలో మిడ్ నైట్ షోలు కూడా పడొచ్చని భావిస్తున్నారు. సలార్, గుంటూరు కారం, కల్కి, దేవర లాంటి పెద్ద సినిమాలకు అర్ధరాత్రి షోలు పడ్డ సంగతి తెలిసిందే.
This post was last modified on November 4, 2024 10:16 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…