భీష్మ తర్వాత నితిన్ సక్సెస్ చూసి నాలుగేళ్లు గడిచిపోయాయి. రంగ్ దే మరీ డ్యామేజ్ చేయలేదు కానీ మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ ఒకదాన్ని మించి మరొకటి పోటీపడి మరీ డిజాస్టర్లయ్యాయి. అందుకే అతి మూసకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న నితిన్ కేవలం రెండు నెలల గ్యాప్ లో రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వాటిలో మొదటిది రాబిన్ హుడ్ డిసెంబర్ 20 విడుదలకు రెడీ అయ్యింది. ఛలో, భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ కాగా దొంగతనాల బ్యాక్ డ్రాప్ లో కథ చెబుతారట.
మైత్రి మూవీ మేకర్స్ రాజీ లేకుండా నిర్మాణం సాగించారు కాబట్టి ప్రొడక్షన్ వేల్యూస్ పరంగా గ్రాండ్ గా ఉంటుంది. ఫారిన్ షెడ్యూల్స్ ఎక్కువే చేశారు.ఇంకా టీజర్ రాలేదు కాబట్టి కంటెంట్ మీద వెంటనే ఒక అవగాహనకు రాలేం కానీ చిరంజీవి ప్రాజెక్టు మిస్సయ్యాక చేస్తున్న సినిమా కావడంతో వెంకీ కుడుముల చాలా కసితో చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. ఇక నెక్స్ట్ లైన్ లో ఉన్నది తమ్ముడు. వకీల్ సాబ్ తర్వాత నిర్మాత రాజు దర్శకుడు శ్రీరామ్ వేణుని లాక్ చేసుకుని ఆ మాట మేరకు ఇచ్చిన మూవీ. బడ్జెట్ కూడా నితిన్ కెరీర్ లోనే అత్యధికం అంటున్నారు. ఒక్క ఫైట్ కే రెండు కోట్లంటే మాటలా.
మైత్రి, ఎస్విసి ఇలా రెండు బడా సంస్థలతో నితిన్ సినిమాలు చేయడం కొత్త కాదు కానీ ఇంత గ్రాండ్ స్కేల్ లో వరసగా తెరకెక్కడం మాత్రం ఫ్యాన్స్ కి పండగే. అందులోనూ అతి తక్కువ గ్యాప్ లో వరస రిలీజులు ఎప్పుడూ చేయలేదు. గత కొన్నేళ్లుగా ఏడాదికి ఒకటే చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా డబుల్ బొనాంజా రెడీ అవుతోంది. రాబిన్ హుడ్ వినోదం మీద ఎక్కువ ఆధారపడగా తమ్ముడులో కమర్షియల్ ఎలిమెంట్స్, సెంటిమెంట్ పుష్కలంగా దట్టించారు. ఈ రెండు హిట్టయితే మాత్రం నితిన్ మళ్ళీ ఊపందుకున్నట్టే. అది ఏ స్థాయిలో అనేది వేచి చూడాలి. ఇంకొద్ది రోజుల్లో తమ్ముడు ప్రకటన రావొచ్చు.
This post was last modified on November 4, 2024 10:03 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…