అభిమాన హీరోల బర్త్ డేలు వస్తేనో.. లేదంటే వాళ్ల సినిమాలకు సంబంధించి వార్షికోత్సవాలు జరిగితేనో.. లేదా ఏవైనా టీజర్లు, ఇతర విశేషాలు రిలీజైతేనో సోషల్ మీడియాలో ‘రికార్డు’ ట్వీట్లు వేయడం.. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యేలా చేయడం ఈ మధ్య ఆనవాయితీగా మారింది.
వీటిలో కూడా రికార్డుల గురించి చెప్పుకుని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. హీరోల పీఆర్వోలు, వ్యక్తిగత సిబ్బంది పనిగట్టుకుని ఈ ట్రెండ్స్ కోసం ఒక మాఫియాను నడిపిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. డబ్బులు ఖర్చు పెట్టి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ట్వీట్లు వేయడం గమనిస్తూనే ఉన్నాం.
మొన్న అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు ఇలా కొందరు పనిగట్టుకుని ఫేక్ అకౌంట్ల ద్వారా ఒక టార్గెట్ పెట్టుకుని ట్వీట్లు వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. మిగతా హీరోల అభిమానులు కూడా ఇందులో తక్కువేమీ లేదు.
ఎన్టీఆర్ పుట్టిన రోజుకు నెల రోజుల కౌంట్ డౌన్‌ను పురస్కరించుకుని అతడి అభిమానులు కూడా ‘రికార్డ్’ బ్రేకింగ్ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇందులోనూ పీఆర్వో టీం పాత్ర ఉందన్న అనుమానాలున్నాయి. ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కూడా ఇదే పనిలో పడ్డారు. మహేష్ కెరీర్లో అతి పెద్ద హిట్టుగా నిలిచిన ‘పోకిరి’కి 14 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఫేక్ రికార్డుల కోసం అభిమానులు పడ్డ ఆరాటం గురించి సాక్ష్యాలు బయటికి వచ్చాయి.
ఈ విషయంలో అభిమానుల మధ్య కాన్వర్జేషన్లు.. ఫేక్ రికార్డు కోసం కొన్ని గ్రూపులకు డబ్బులు పంచడాల గురించి స్క్రీన్ షాట్లు ట్విట్టర్లో దర్శనమిస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ఫేక్ అకౌంట్లు పెట్టి రికార్డు కోసం ప్రయత్నిస్తున్న వైనంపై ట్విట్టర్ యాజమాన్యానికి కంప్లైంట్లు వెళ్లడంతో అనుమానాస్పదంగా ఉన్న అకౌంట్లు చాలా వాటిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఇలాంటి రికార్డులు పట్టుకుని అభిమానులు, పీఆర్వోలు ఏం చేసుకుంటారన్నది అర్థం కాని విషయం.
This post was last modified on April 28, 2020 4:52 pm
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…