Movie News

అంచనాలు పెంచేది ఎప్పుడో ఇంకెప్పుడో

బహుశా నిఖిల్ కెరీర్ లోనే తక్కువ సౌండ్ తో వస్తున్న సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నవంబర్ 8 విడుదలలో ఎలాంటి మార్పు లేదని తాజాగా మొదలైన ప్రమోషన్లతో క్లారిటీ వచ్చేసింది.

అయితే కేవలం అయిదు రోజులే ఉన్నప్పటికీ పబ్లిసిటీ పరంగా దూకుడు పెంచకపోవడం అసలు ఈ సినిమా వస్తోందనే సంగతి కామన్ ఆడియన్స్ కి తెలుసాని అనుమానం వచ్చేలా ఉంది. సప్తసాగరాలు దాటి సైడ్ ఎబిలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఏ జానరో కూడా రివీల్ చేయకుండా ఉన్నారు. ట్రైలర్ చూశాక ఎలాగూ తెలుస్తుంది కానీ ముందైతే క్లూస్ ఇవ్వాలిగా.

అప్పుడో ఇప్పుడో ఎప్పుడోకున్న ప్రధాన సమస్య రిలీజ్ విషయంలో జరిగిన జాప్యం. సరే జరిగిందేదో జరిగిందనుకున్నా పబ్లిక్ లో హాట్ టాపిక్ గా మారేలా ఏదో ఒకటి చేయకపోతే ఆడియన్స్ దృష్టిలో పడటం కష్టం. నిత్యం పేరు నానుతూ ఉండాలి.

నిఖిల్ స్వయంగా ఇంటర్వ్యూలు గట్రా చేస్తున్నా హైప్ పెంచే క్రమంలో ప్రొడక్షన్ హౌస్ మరీ వేగంగా లేకపోవడం ఉన్ని కాసిన్ని అంచనాలను తగ్గించేస్తుంది. పోనీ దర్శకుడి బ్రాండ్ మీద ఏమైనా మార్కెటింగ్ చేద్దామా అంటే సుధీర్ వర్మ గత రెండు సినిమాలు రవితేజ రావణాసుర, శాకినీ డాకిని రెండూ మాములు డిజాస్టర్లు కాలేదు.

రాబోయే శుక్రవారం పెద్దగా పోటీ లేదు. నాలుగైదు సినిమాలు రేసులో ఉన్నాయి కానీ అమాంతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినవి లేవు. సో ఈ అవకాశాన్ని అప్పుడో ఇప్పుడో ఎప్పుడో వాడుకోవచ్చు. అదేదో ఆషామాషీగా ఉండకూడదు. ఒకవైపేమో లక్కీ భాస్కర్, క, అమరన్ రెండో వారంలోనూ స్ట్రాంగ్ రన్ కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆపై నవంబర్ 14 మట్కా, కంగువ, దేవకీనందన వాసుదేవలు దిగుతున్నాయి. వీటి మధ్య కేవలం వన్ వీక్ టార్గెట్ తో అప్పుడో ఎప్పుడో ఎప్పుడో దిగడం ఖచ్చితంగా రిస్కే. సినిమా బాగుంటే ఢోకా లేదు కానీ తడబడితే మాత్రం లేనిపోని ఇబ్బందులు. చూడాలి. 

This post was last modified on November 3, 2024 4:43 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

41 minutes ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

7 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

7 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

7 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

9 hours ago