ఒక చిన్న పల్లెటూరు. దాని వెనుకో రహస్యాన్ని దాచుకున్న క్రైమ్. అది ఛేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఊహించని ట్విస్టులతో ఉక్కిరిబిక్కిరి చేసి షాకింగ్ క్లైమాక్స్ తో శుభం కార్డు వేస్తారు. గత కొన్నేళ్లుగా ఇదో సక్సెస్ ఫార్ములాగా మారిపోతున్న వైనాన్ని దర్శక రచయితలు గుర్తించబట్టే ప్రత్యేక జానర్ రూపాంతరం చెందుతోంది.
అదెలాగో ఫ్లాష్ బ్యాక్ నుంచి వర్తమానం దాకా చూద్దాం. సాయి ధరమ్ తేజ్ హిట్ చాలా అవసరమైన టైంలో వచ్చిన ‘విరూపాక్ష’లో కథంతా ఒక మారుమూల అటవీ ప్రాంతంలో జరుగుతుంది. అంతుచిక్కని మలుపులతో దర్శకుడు ఇచ్చిన షాకులు సూపర్ హిట్ అందించాయి.
మొదటి భాగం ఓటిటిలో వచ్చి విజయవంతమయ్యాక థియేటర్ కోసం సీక్వెల్ తీయడం ‘మా ఊరి పొలిమేర 2’ విషయంలోనే జరిగింది. అసలు స్టార్ క్యాస్టింగ్ లేకుండా అంత వసూళ్లు రావడం చూసి ట్రేడ్ షాక్ తింది. ఒక కుగ్రామంలలో ఎక్కడో దాచబడిన నిధి చుట్టూ ప్లాట్ తిరుగుతుంది.
ఫ్లాపు తీసి కసిమీదున్న అజయ్ భూపతికి ‘మంగళవారం’ రూపంలో తిరిగి కంబ్యాక్ అయ్యింది విలేజ్ థ్రిల్లర్ తోనే. ఇందులో సిటీ ఛాయలు పొరపాటున కూడా కనిపించవు. అంతకు ముందు వచ్చిన ‘మాసూద’లో హైదరాబాద్ నేపథ్యం ఉన్నా అసలు స్టోరీ తీసుకెళ్లేది జనాలు తక్కువగా ఉండే ఒక మారుమూల పల్లెటూరికి.
సందీప్ కిషన్ ‘ఊరిపేరు భైరవకోన’ ఏకంగా టైటిల్ లోనే తన ఉద్దేశాన్ని చెప్పేసింది. ఇది కూడా బాక్సాఫీస్ టెస్టులో విజయం సాధించినదే. ఇక లేటెస్ట్ సెన్సేషన్ ‘క’ ఇదే కోవలోకి చేరుతోంది. మధ్యాన్నానికే చీకటి పడే క్రిష్ణగిరి అనే ఊరి చుట్టూ అల్లిన క్రైమ్ థ్రిల్లర్ జనాలను మెప్పించింది.
ఫలితంగా కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పుడే కాదు ఎప్పుడో ఎనభై దశకంలో వచ్చిన వంశీ ‘అన్వేషణ’ సైతం అడవి, చిన్న గ్రామం చుట్టే తిరిగి మైండ్ పోగొడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి కానీ మొత్తానికి పల్లెటూరిలో రాసుకునే మిస్టరీ, హిట్టు కొట్టే హిస్టరీగా మారిపోతోంది.
This post was last modified on November 3, 2024 4:41 pm
ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను…
పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించనిది…
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…
కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…
తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…
కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…