అదేదో సామెత చెప్పినట్టు అత్త తిట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకులా అయ్యింది అక్షయ్ కుమార్ పరిస్థితి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే ఇటీవలే విడుదలైన బ్లాక్ బస్టర్ అమరన్ శివ కార్తికేయన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తోంది.
కేవలం మూడు రోజులకే వంద కోట్ల మైలురాయిని దాటడం చూసి ట్రేడ్ ఆశ్చర్యపోతోంది. తమిళంలో అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇంత తీవ్రమైన పోటీ మధ్య ఏపీ తెలంగాణ లాంటి పక్క రాష్ట్రాల్లో డబ్బింగ్ వెర్షన్ సైతం అదే స్థాయిలో ఆడటం చూసి అందరూ షాకవుతున్నారు. సాయిపల్లవి, జివి ప్రకాష్ సంగీతం, ఎమోషనల్ కంటెంట్ జనాన్ని కట్టిపడేస్తున్నాయి.
దీంతో ఇప్పుడీ అమరన్ ని కూడా అక్షయ్ కుమార్ వదలడని యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఎందుకంటే రీమేకులు చేయడంలో ఈయనకీయనే సాటి కాబట్టి. సూర్య ఆకాశం నీ హద్దురాని అదే దర్శకురాలితో కోరిమరీ సర్ఫిరాగా తీయించుకున్నాడు.
తీరా చూస్తే అదేమో పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కు తేలేనంత దారుణంగా డిజాస్టరయ్యింది. గతంలో లారెన్స్ కాంచనని అతనితోనే హిందీలో చేశాడు. డైరెక్ట్ ఓటిటి రిలీజైనా సరే బొమ్మ అడ్డంగా తిరగబడింది. ఇవే కాదు గద్దలకొండ గణేష్, రాక్షసుడు వగైరాలను వదల్లేదు. అంతకు ముందు రీమేక్ హిట్లున్నాయి కానీ గత కొన్నేళ్లలో తగ్గిపోయాయి.
మనమేదో తమాషాకు అనుకుంటున్నా అక్షయ్ కుమార్ నిజంగా అమరన్ ని హిందీలో తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలాగూ అక్కడి ఆడియన్స్ కి ఒరిజినల్ వెర్షన్ రీచ్ కాలేదు కాబట్టి ఒక ప్రయత్నం చేయొచ్చు.
వేగంగా సినిమాలు చేయడం తప్ప కంటెంట్ గురించి అస్సలు పట్టించుకోడనే విమర్శలు మూటగట్టుకున్న అక్షయ్ కుమార్ ఇటీవలే ఖేల్ ఖేల్ మే, బడే మియా చోటే మియాతో పలకరించాడు కానీ రెండూ తుస్సుమన్నాయి. క్యామియో చేసిన సింగం అగైన్ కు సైతం రివ్యూలు పాజిటివ్ గా లేవు. అన్నట్టు మంచు విష్ణు కన్నప్పలో శివుడిగా నటించి టాలీవుడ్ డెబ్యూ చేయబోతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 3, 2024 4:12 pm
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…
ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…