Movie News

జీవి ప్రకాష్ కుమార్….దారిలోకి వచ్చాడు

తెలుగు దర్శకులకేమో తమన్, దేవిలు అంత సులభంగా దొరకడం లేదు. పోనీ అనూప్, మణిశర్మ లాంటి ఓల్డ్ స్కూల్ బ్యాచ్ ని తీసుకుంటే ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు ఇవ్వలేకపోతున్నారు. అందుకే కోలీవుడ్ మినహా వేరే ఆప్షన్ లేకుండా పోతోంది. అలాని వాళ్ళు ప్రతిసారి అద్భుతాలు చేయడం లేదు.

కొన్నిసార్లు దెబ్బలు పడుతున్నాయి. జివి ప్రకాష్ కుమార్ నే తీసుకుంటే గత ఏడాది రవితేజ టైగర్ నాగేశ్వరరావు, వైష్ణవ్ తేజ్ ఆదికేశవలకు బ్యాడ్ ఆల్బమ్స్ ఇచ్చాడు. ఒకటి రెండు పాటలు ఓకే అనిపించుకున్నా ఓవరాల్ గా చూసుకుంటే అతని స్థాయి మ్యూజిక్ పడలేదన్నది వాస్తవం.

ఇప్పుడు దీపావళి అతనికి డబుల్ బొనాంజా తెచ్చేసింది. లక్కీ భాస్కర్ బీజీఎమ్ కు ప్రశంసలు వచ్చాయి. రిట్రో సెటప్ కు తగ్గట్టు మంచి స్కోర్ ఇచ్చాడని విమర్శకులు మెచ్చుకున్నారు. పాటలకు ఎక్కువ స్కోప్ లేకపోవడంతో ఉన్నంతలో డీసెంట్ అనిపించాయి కానీ సార్ లో మాస్టారు రేంజ్ లో లేదన్నది నిజం.

ఇక శివ కార్తికేయన్ అమరన్ ఆత్మను ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా నేపధ్య సంగీతం సమకూర్చడంలో జివి సక్సెసయ్యాడు. ఎలాంటి ఓవర్ సౌండ్లు, ఎలివేషన్లు లేకుండా దర్శకుడు కోరుకున్న రీతిలో ఇచ్చి మెప్పు పొందాడు. ఇంతకు ముందు తంగలాన్ సైతం కాంప్లిమెంట్స్ అందుకున్నదే.

నెక్స్ట్ జీవి నుంచి ఇంటరెస్టింగ్ టాలీవుడ్ సినిమాలున్నాయి. వాటిలో మొదటిది వరుణ్ తేజ్ మట్కా. ఒక మాఫియా డాన్ బయోపిక్ గా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ ప్యాన్ ఇండియా మూవీ నవంబర్ 14 విడుదల కానుంది. ట్రైలర్ చూస్తే కంటెంట్ తో పాటు జివి ప్రకాష్ మీద కూడా నమ్మకం కలిగించేలా ఉంది.

ఆపై నెల తిరగడం ఆలస్యం నితిన్ రాబిన్ హుడ్ డిసెంబర్ 20 వచ్చేస్తుంది. దర్శకుడు వెంకీ కుడుముల మంచి పాటలు రాబట్టుకోవడంలో నేర్పరి. సో సాంగ్స్ విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు. ఇవి కాకుండా సూర్య 43, విక్రమ్ వీరధీర శూరన్ లాంటి క్రేజీ ప్రాజెక్టులు ఇతని ఖాతాలోనే ఉన్నాయి.

This post was last modified on November 3, 2024 4:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

59 minutes ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

2 hours ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

4 hours ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

5 hours ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

6 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

7 hours ago