Movie News

తండేల్ చివరి నిర్ణయం అదేనా

అక్కినేని అభిమానులు అప్డేట్స్ కోసం అలో లక్ష్మణా అంటూ తపించిపోతున్న తండేల్ విడుదల తేదీ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే దిశగా వెళ్తోందని ఇన్ సైడ్ టాక్. సంక్రాంతికే వదలమని ఫ్యాన్స్ నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నప్పటికీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్న నిర్మాత అల్లు అరవింద్ సోలో రిలీజ్ కోసమే కట్టుబడతారని తెలిసింది. అయితే జనవరిలో వచ్చేందుకు అవకాశం తక్కువ. ఉన్న ఒక్క ఆప్షన్ చివరి వారంలో వచ్చే రిపబ్లిక్ డే. ఇది మంది డేటే. సరైన ప్లానింగ్ చేసుకుని ప్రమోషన్లు చేసుకుంటే ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతుంది. లేదూ అంటే ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లో వచ్చే తీరాలి. 

గతంలో నాగచైతన్య సినిమాల్లో ఏ మాయ చేసావే ఫిబ్రవరిలో రిలీజై మంచి విజయం అందుకుంది. రికార్డులు బద్దలు కాలేదు కానీ సూపర్ హిట్ తో పాటు కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది. తర్వాత అధిక శాతం చైతు సక్సెస్ లన్నీ మేలోనే వచ్చాయి. అలాంటప్పుడు ఫిబ్రవరి సరైన ఛాయస్ కాదనేది అభిమానుల వాదన. అయితే ఇదేమి బ్యాడ్ మంత్ కాదు. గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్లు వచ్చిన దాఖలాలున్నాయి. సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య 109, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, సందీప్ కిషన్ మజాకాలు ఆల్రెడీ ఉన్న నేపథ్యంలో తండేల్ దింపడం ఓపెనింగ్స్ పరంగా ఎంత మాత్రం సేఫ్ కాదనేది గీతా ఆర్ట్స్ వెర్షన్. 

ఈ లెక్కన చూస్తుంటే జనవరి చివరి వారం కూడా మిస్ అయితే ఫిబ్రవరిలోనే తండేల్ దర్శనం ఉంటుంది. ఇంకో రెండు మూడు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో సాయిపల్లవి పాత్ర, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి. ఇండియా నుంచి పాకిస్థాన్ వెళ్లి అక్కడ జైల్లో మగ్గిన స్నేహితుల కోసం చైతు ఏం చేశాడనే పాయింట్ మీద తండేల్ రూపొందింది. సముద్రం ఎపిసోడ్లు, జాతర పాట, హీరో హీరోయిన్ ప్రేమకథ, పాక్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని అంటున్నారు. 

This post was last modified on November 3, 2024 11:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కంగువ సౌండ్‌పై విమ‌ర్శ‌లు.. దేవి ఏమ‌న్నాడంటే?

సూర్య సినిమా ‘కంగువా’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ…

9 hours ago

తమన్ భావోద్వేగం… ఆలోచించాల్సిన ఉత్పాతం

సోషల్ మీడియా ప్రపంచంలో రోజురోజుకి నెగటివిటీ ఎక్కువైపోతోంది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే వందల కోట్లు పోసిన ఒక ప్యాన్…

10 hours ago

రావిపూడి చెప్పిన స్క్రీన్ ప్లే పాఠం

ఇప్పుడు ఫిలిం మేకింగ్ లో కొత్త పోకడలు ఎన్నో వచ్చాయి. గతంలో రచయితలు పేపర్ బండిల్, పెన్ను పెన్సిల్, ఇతర…

10 hours ago

శంకర్ కూతురికీ అదే ఫలితం దక్కింది

ఇండియన్ స్పిల్బర్గ్ గా అభిమానులు పిలుచుకునే దర్శకుడు శంకర్ కొన్నేళ్లుగా తన ముద్ర వేయలేకపోవడం చూస్తున్నాం. 2.0కి ప్రశంసలు వచ్చాయి…

11 hours ago

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. భార‌త సైన్యం మృతి…

దాదాపు రెండు సంవ‌త్స‌రాల‌కు పైగానే జ‌రుగుతున్న ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం .. ప్ర‌పంచ‌శాంతిని ప్ర‌శ్నార్థ‌కంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ…

11 hours ago

ఈ రోజు అనిల్ లేకపోతే మేము లేము…

ఒక‌ప్పుడు నిల‌క‌డ‌గా హిట్లు కొడుతూ దూసుకెళ్లిన అగ్ర‌ నిర్మాత దిల్ రాజు.. గ‌త కొన్నేళ్లుగా స‌రైన విజ‌యాలు లేక ఇబ్బంది…

12 hours ago