Movie News

దయ్యం ముందు సూపర్ స్టార్లు దిగదుడుపు

ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషించిన ‘ఖేల్ ఖేల్ మే’, జాన్ అబ్రహాం ‘వేద’ కూడా రిలీజయ్యాయి. ‘స్త్రీ-2’ లేడీ ఓరియెంటెడ్ మూవీ. అందులో శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్ర పోషించింది. రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించాడు.

వీళ్లతో పోలిస్తే అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం పెద్ద స్టార్లు. కానీ ‘స్త్రీ-2’ ముందు.. ఖేల్ ఖేల్ మే, వేద సినిమాలు అస్సలు నిలబడలేకపోయాయి. ‘స్త్రీ-2’ ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లు రాబడితే.. మిగతా రెండు చిత్రాలు కలిపి ఇందులో నాలుగో వంతు వసూళ్లకు పరిమితం అయ్యాయి. దయ్యం సినిమా ముందు సూపర్ స్టార్ల చిత్రాలు వెలవెలబోయిన పరిస్థితి. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో ఇదే ట్రెండ్ రిపీటవుతోంది.

దీపావళి కానుకగా ‘భూల్ భులాయియా-3’ సినిమా విడుదలైంది. అందులో కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్ చేశాడు. దీనికి పోటీగా ‘సింగమ్ అగైన్’ విడుదలైంది. అందులో అజయ్ దేవగణ్ హీరో. కరీనా కపూర్ కథానాయిక. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్.. ఇలా చాలామంది స్పెషల్ క్యామియోలు చేశారు ఈ చిత్రంలో.

ఐతే కంటెంట్ పరంగా చూస్తే ‘భూల్ భులాయియా-3’ ముందు ‘సింగమ్ అగైన్’ నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. రిలీజ్‌కు ముందు ఉన్న హైప్, స్టార్ పవర్ కారణంగా తొలి రోజు ‘సింగమ్ అగైన్’కు మంచి వసూళ్లే వచ్చాయి.

కానీ మిడ్ రేంజ్ మూవీ అయినా, తక్కువ థియేటర్లలో రిలీజైనా ‘భూల్ భులాయియా-3’ కూడా దానికి దీటుగా ఓపెనింగ్స్ తెచ్చుకుంది. రెండో రోజు టికెట్ల అమ్మకాల ట్రెండ్ చూస్తే ఈ చిత్రమే పైచేయి సాధించే సంకేతాలు కనిపిస్తున్నాయి. వీకెండ్ తర్వాత కచ్చితంగా ఈ హార్రర్ కామెడీనే ‘సింగమ్ అగైన్’తో పోలిస్తే ముందంజలో నిలిచేలా ఉంది. మొత్తానికి మరోసారి దయ్యం ముందు స్టార్లు నిలవలేకపోతున్నారన్నమాట.

This post was last modified on November 2, 2024 9:54 pm

Share

Recent Posts

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

23 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

11 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

11 hours ago