ఈ ఏడాది పెద్ద సినిమాల సందడి అనుకున్న స్థాయిలో లేకపోయింది. సంక్రాంతికి ‘గుంటూరు కారం’, జులైలో ‘కల్కి 2898 ఏడీ’, సెప్టెంబరు చివర్లో ‘దేవర’ మాత్రమే పెద్ద చిత్రాలు. వీటిలో ‘గుంటూరు కారం’ నిరాశపరచగా.. మిగతా రెండు చిత్రాలు బాగానే ఆడాయి.
ఇక టాలీవుడ్ నుంచి రాబోతున్న తర్వాతి పెద్ద సినిమా అంటే ‘పుష్ప: ది రూల్’యే. కేవలం తెలుగులోనే కాక దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య భాషల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ‘పుష్ఫ-2’ విడుదలకు అటు ఇటుగా నెల రోజులే సమయం ఉంది. ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా రిలీజ్ భారీగా ఉండబోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మోత మోగిపోవడం ఖాయం. కాగా యుఎస్‌లో చాలా ముందుగానే ఈ చిత్రానికి ప్రి సేల్స్ మొదలుపెట్టేశారు.
‘పుష్ప: ది రూల్’ టికెట్ల అమ్మకాలను తాజాగా మొదలుపెట్టారు యుఎస్‌లో. ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అక్కడి ప్రేక్షకుల్లో ఉత్సాహం మామూలుగా లేదు. కొన్ని గంటల్లోనే లక్ష డాలర్ల మార్కును టచ్ చేసేసింది ‘పుష్ప-2’. ఈ ఊపు చూస్తుంటే ప్రి సేల్స్ విషయంలో రికార్డులు నమోదు కావడం గ్యారెంటీ. ‘దేవర’ సినిమాకు ప్రి సేల్స్ ద్వారా రిలీజ్‌కు ముందే 2 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చేశాయి.
‘పుష్ప-2’ ఆరంభం చూస్తే ‘దేవర’ కంటే ముందే ఆ మార్కును టచ్ చేసేలా ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. ప్రి సేల్స్‌తోనే 3 మిలియన్ డాలర్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదు. సినిమా బాగుంటే ఫుల్ రన్లో 10 మిలియన్ మార్కును కూడా అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరల్డ్ వైడ్ వెయ్యి కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు వస్తాయనే అంచనాలు కూడా ఉన్నాయి. డిసెంబరు 5న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 2, 2024 4:41 pm
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…