ఏవేవో ప్రయోగాలు చేయబోయి, ఏదో కొత్తగా ట్రై చేస్తున్నానుకుని వరస డిజాస్టర్లు చవి చూసిన వరుణ్ తేజ్ ఎట్టకేలకు దారిలో పడ్డాడు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా బోల్తా కొట్టడం మెగా ప్రిన్స్ మార్కెట్ ని ప్రమాదంలో పడేసింది. ఎఫ్ 3 సక్సెస్ అయినా దాని క్రెడిట్ వెంకటేష్, అనిల్ రావిపూడిలకు ఎక్కువగా దక్కింది కాబట్టి సోలో హిట్ కోసం వరుణ్ ఎదురు చూస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో నవంబర్ 14న మట్కాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన కంగువ లాంటి ప్యాన్ ఇండియా మూవీతో ఒకే రోజు క్లాష్ కి సిద్ధపడ్డాడు.
ఇంత రిస్క్ ఎందుకబ్బా అనే ప్రశ్నకు సమాధానం ఇవాళ విడుదల మట్కా ట్రైలర్ లో ఇచ్చేశారు. వైజాగ్ లో ఒక మాములు కూలీగా జీవితం మొదలుపెట్టిన వాసు అనే వ్యక్తి వందల కోట్లకు పడగలెత్తే స్థాయికి ఎలా చేరుకున్నాడు, ఈ క్రమంలో అతను గెలుచుకుంది ఏంటి, పోగొట్టుకున్నది ఏంటి లాంటివన్నీ ఒక బయోపిక్ తరహాలో చూపించబోతున్నారు. దర్శకుడు కరుణ కుమార్ ప్రెజెంట్ చేసిన విధానం, అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆర్ట్ వర్క్, భారీ బడ్జెట్ ఇవన్నీ కంటెంట్ ఎంత రిచ్ గా ఉండబోతోందో స్పష్టం చేశాయి. కావలసిందల్లా ఎంగేజ్ చేసేలా కథా కథనాలు ఉండటమే.
సో మట్కా మీద నమ్మకం ఏర్పడేందుకు ఇది సరిపోతుంది. లక్కీ భాస్కర్ తో ఇటీవలే హీరోయిన్ గా పెద్ద హిట్టు అందుకున్న మీనాక్షి చౌదరి కేవలం రెండు వారాల గ్యాప్ తో మరోసారి పలకరించబోతోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం మరో ఆకర్షణగా నిలవబోతోంది. రిలీజ్ రోజు కాంపిటీషన్ ఒక్క కంగువతోనే ఆగిపోవడం లేదు. ప్రశాంత్ వర్మ కథను అందించిన దేవకీనందన వాసుదేవ కూడా అదే రోజు వస్తోంది. సో ట్రయాంగిల్ వార్ గట్టిగానే ఉండబోతోంది. ఇప్పుడు ట్రైలర్ చూశాక ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో అంచనాలు పెరిగేలా ఉన్నాయి కాబట్టి వాటిని నిలబెట్టుకుంటే మాత్రం బ్లాక్ బస్టర్ పడ్డట్టే.
This post was last modified on November 2, 2024 2:47 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…