పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల కోట్ల బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీస్ తీసే స్టార్ హీరోలు ఎవరూ ఈ పండక్కు లేకపోయినా కంటెంట్ ని నమ్ముకుని వచ్చిన స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు థియేటర్లను కళకళలాడేలా చేశాయి. ఇక విజేత ఎవరనే ప్రశ్న వేసుకుంటే సమాధానం కొంచెం క్లిష్టంగానే ఉంది. ముందు ‘లక్కీ భాస్కర్’ సంగతి చూస్తే యునానిమస్ గా పాజిటివ్ రివ్యూలు, బాగుందనే పబ్లిక్ టాక్ తో లాంగ్ రన్ ని టార్గెట్ పెట్టుకున్న వైనం వసూళ్లలో స్పష్టమవుతోంది. వారాంతం బుకింగ్స్ బాగుండటం శుభసూచకం.
నిర్మాత నాగవంశీ చెప్పినట్టు పోటీ వల్ల రెవిన్యూ అందరికీ షేర్ అవుతోంది కనక ఏదో మాస్ హీరో సినిమాలా తొలి రెండు రోజుల వసూళ్లను కొలమానంగా పెట్టుకోవద్దంటూ చెప్పడం వాస్తవమేనని చెప్పాలి. ఇక సర్ప్రైజ్ హిట్ గా పరిగణిస్తున్న ‘క’ కిరణ్ అబ్బవరం ఫ్లాపుల ప్రవాహానికి బ్రేక్ వేసింది. నమ్ముకున్న క్లైమాక్స్ నిలువునా నిలబెట్టింది. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ దాటిపోవడం ఖాయమనే అంచనా నిజం కావడం ఖాయం. ఇక షాకింగ్ హిట్ గా ‘అమరన్’ గురించి ట్రేడ్ మాట్లాడకుంటూనే ఉంది. ఏదో మొదటి రోజు ఓ మోస్తరుగా ఉంటే గొప్పనుకుంటే ఏకంగా మూడో రోజుకు మరింత బలంగా మారిపోయి జనాన్ని ఆకట్టుకుంటోంది.
పూర్తిగా ఫెయిలైన క్యాటగిరీలో ప్రశాంత్ నీల్ కథ అందించిన ‘బఘీరా’ ఒకటే నిలిచింది. పరిచయం లేని శ్రీమురళి హీరో కావడంతో పాటు దర్శకుడి ప్రెజెంటేషన్ మరీ మూసగా ఉండటంతో ఆడియన్స్ తిరస్కరించారు. వీటితో పాటు హిందీ నుంచి వచ్చిన రిలీజుల్లో ‘సింగం అగైన్’ తన మీద నమ్మకాన్ని నెరవేర్చే సూచనలు కనిపించడం లేదు. రోహిత్ శెట్టి నుంచి ఇంత రొటీన్ కంటెంట్ ఆశించలేదని ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. దీనికన్నా ‘భూల్ భులయ్యా 3’ మెరుగ్గా ఉంది కానీ స్త్రీ 2 స్థాయిలో మేజిక్ జరగడం అనుమానమే. టాలీవుడ్ వరకు చూసుకుంటే విన్నర్లే ఎక్కువ కావడం సంతోషించే పరిణామం.
This post was last modified on %s = human-readable time difference 4:36 pm
ఈ ఏడాది పెద్ద సినిమాల సందడి అనుకున్న స్థాయిలో లేకపోయింది. సంక్రాంతికి ‘గుంటూరు కారం’, జులైలో ‘కల్కి 2898 ఏడీ’,…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’ విడుదలకు ముందు అడ్డంకులు ఎదురవుతున్నాయి. శివ దర్శకత్వంలో…
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బాధ్యత…
మొన్న వెంకటేష్ 76 సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో పాటు సంక్రాంతి విడుదలని ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్…
https://www.youtube.com/watch?v=FKtnAhHnfUo ఏవేవో ప్రయోగాలు చేయబోయి, ఏదో కొత్తగా ట్రై చేస్తున్నానుకుని వరస డిజాస్టర్లు చవి చూసిన వరుణ్ తేజ్ ఎట్టకేలకు…
ఏపీలో గత కొద్ది రోజులుగా అత్యాచార ఘటనలు, హత్యాచార ఘటనలు జరుగుతున్న వైనం కలచివేస్తోన్న సంగతి తెలిసిందే. పోలీసులు ఎంత…