అన్ స్టాపబుల్ షో చూశాక బాలయ్య ఎనర్జీ అఫ్ స్క్రీన్ కూడా ఏ స్థాయిలో ఉంటుందో ప్రేక్షకులకు అర్థమయ్యింది కానీ పబ్లిక్ స్టేజి మీద సైతం అదే జోరు చూపిస్తారని నిరూపించే సందర్భాలు తక్కువగా వస్తాయి. ఇటీవలే అబూ దాబిలో నెక్సా ఐఫా ఉత్సవం అవార్డుల వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణకు గోల్డెన్ లెగసి పురస్కారాన్ని అందజేశారు. దగ్గుబాటి రానా, సిద్దు జొన్నలగడ్డ వ్యాఖ్యాతలుగా చేసిన ఈ వేడుకలో చాలా మెరుపులే జరిగాయి. అందులో ఒకటి బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్, బాలయ్యల మధ్య జరిగిన ఆన్ స్టేజి సరదా సంభాషణ.
సమకాలీకుల్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ ముగ్గురిలో ఎవరంటే ఇష్టమని కరణ్ జోహార్ చాలా తెలివైన ప్రశ్నగా భావించి బాలయ్యని అడిగాడు. దానికాయన ఏ మాత్రం సంకోచించకుండా నీకు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లలో ఎవరంటే బాగా ఇష్టమని రివర్స్ కౌంటర్ వేయడంతో ఒక్కసారిగా స్టేడియం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూలాగా వచ్చిన అతిథి తన క్వశ్చన్ తో లాక్ అవుతారనుకుంటే ఇలా రివర్స్ లో పంచ్ వేయడం చూసి షాకవ్వడం హోస్ట్ వంతయ్యింది. తేరుకునేలోపే బాలయ్య స్టయిల్ గా కుర్చీ నుంచి లేవడం, ఈలలు వినిపించడం జరిగిపోయాయి.
ఇలా సౌత్ హీరోలను కవ్వించడం అప్పుడప్పుడు హిందీ ప్రముఖులు చేయడం గతంలో జరిగింది కానీ ఈ మధ్య బలమైన సమాధానాలు రావడం మొదలవ్వడంతో తగ్గించారు. ఓసారి ప్రముఖ నార్త్ యాంకర్ ఒకరు రానాని సౌత్, నార్త్ అంటూ సినిమాని వేరుగా చేసి మేం ఎక్కువ అన్నట్టు మాట్లాడింది. దానికి రానా బదులు చెబుతూ బాహుబలి వచ్చాక అవన్నీ పోయాయని, హిందీ టాప్ గ్రాసర్ ఏదుందో ఒకసారి చూడండని చెప్పడం ఓ రేంజ్ లో పేలింది. తాజాగా బాలయ్య ఇచ్చిన కౌంటర్ ఆ కోవలోకి రాకపోయినా తెలుగువాడి సమయస్ఫూర్తిగా నిదర్శనంగా నిలుస్తోంది. అందుకే బాలయ్య రాక్స్ కరణ్ షాక్స్.
This post was last modified on November 2, 2024 12:53 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…