సౌత్ ఫిలిం మేకర్స్ లో అత్యథిక డిమాండ్ ఉన్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ పేరు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుంది. కెజిఎఫ్ తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చాక ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అలాంటి క్రియేటివ్ జీనియస్ కథ ఇచ్చాడన్నా చాలు ఆ సినిమాకు హైప్ వచ్చేస్తుంది. బఘీరాకు ఆ మాత్రం బజ్ కనిపించిందంటే నీల్ బ్రాండ్ ని వాడుకోవడం వల్లే. హోంబాలే ఫిలింస్ అంత బడ్జెట్ తో శ్రీమురళి లాంటి మీడియం రేంజ్ హీరో మీద భారీగా ఖర్చు పెట్టడానికి కారణం కూడా ప్రశాంత్ నీల్ ప్రోత్సాహమే. కానీ దురదృష్టం ఏంటంటే బఘీరా అంచనాలను కనీసం పావు వంతైనా అందుకోలేకపోవడం.
లైన్ పరంగానే బఘీరా కథలో కొత్తదనం కనిపించదు. మంగళూరు ఎసిపి వేదాంత్ (శ్రీమురళి) కి చిన్నప్పటి నుంచే సూపర్ హీరోస్ అంటే విపరీతమైన ఫ్యానిజం. నిజ జీవితంలో పోలీసులు అలాంటి వాళ్లేనని గుర్తించి కోరి మరీ ఈ వృత్తిలోకి వస్తాడు. అయితే అరాచక శక్తులను కట్టడి చేసే క్రమంలో పై అధికారులు ఇతనికి ఆంక్షలు విధిస్తారు. ఓసారి ఊహించని దారుణం కళ్లెదుటే జరగడంతో వేదాంత్ కాస్తా బఘీరాగా మారి రాత్రిపూట దుర్మార్గుల ఆట కట్టించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే రాణా (గరుడ రామ్) తో యుద్ధం మొదలవుతుంది. తర్వాత ఏం జరుగుతుందనేది సగటు మాస్ ప్రేక్షకుడు ఎవరైనా చెబుతాడు.
దర్శకుడు డాక్టర్ సూరి స్క్రీన్ ప్లే, ట్రీట్ మెంట్ రెండూ మరీ రెగ్యులర్ గా సాగిపోవడంతో బఘీరాలో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. రుక్మిణి వసంత్ తో లవ్ ట్రాక్, రౌడీలతో శ్రీమురళి తలపడే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రతిదీ రొటీన్ కి కేరాఫ్ అడ్రెస్ గా తోస్తాయి. క్లైమాక్స్ ముందు వరకు వేదాంత్, రాణాల మధ్య నేరుగా తలపడే సందర్భమే లేకపోవడం బఘీరా క్యారెక్టరైజేషన్ ని బలహీనంగా మార్చేసింది. ఫైట్స్ కంపోజింగ్ బాగున్నప్పటికీ వాటి ముందు వెనుకా అల్లుకున్న ఎమోషన్ జీరో కావడంతో సలార్, కెజిఎఫ్ తరహాలో కనెక్ట్ కాకుండా పోయింది. ఎంత ఓపిక ఉన్నా సరే బఘీరా దాన్ని ముక్కలు చేసి మరీ నిరాశపరుస్తుంది.
This post was last modified on November 2, 2024 10:22 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…