ప్రస్తుతం రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న ఎన్టీఆర్, ఈ మూవీ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ‘అరవింద సమేత వీరరాఘవ’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ఇద్దరూ, మరోసారి చేతులు కలుపుతున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీలో కూడా తనకు అచొచ్చిన ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడట.
‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో విలన్‌గా యంగ్ హీరో నవీన్ చంద్రను చూపించాడు త్రివిక్రమ్. బాల్‌రెడ్డి పాత్రలో ఆలోచన ఉన్న యంగ్ ఫ్యాక్షనిస్టుగా నవీన్ చంద్ర నటన ఆకట్టుకుంది. ఆ తర్వాత అల్లుఅర్జున్ ‘అల వైకుంఠపురంలో’ రాజ్‌గా హీరో సుశాంత్ నటించాడు. అలాగే డిజాస్టర్ రిజల్ట్ వచ్చిన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కూడా హీరో ఆది పినిశెట్టి సెకండ్ హీరోగా కనిపించాడు.
‘అజ్ఞాతవాసి’ విషయంలో వర్కవుట్ కాకపోయినా, ఆ తర్వాత రెండు సినిమాల్లోనూ సూపర్‌గా వర్కవుట్ అయ్యింది ఈ సెకండ్ హీరో సెంటిమెంట్. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్30 మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో టాలీవుడ్ యంగ్ హీరో కనిపించబోతున్నాడని టాక్.
ఇందుకోసం ఇప్పటికోసం అతనితో చర్చలు జరిపారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ యంగ్ హీరో ఎవరనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి, త్రివిక్రమ్- ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తున్నాడని కొందరు అంటుంటే… కాదు త్రివిక్రమ్ ఈ సినిమాతో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారని… అందుకే ఆ సెకండ్ హీరో ఎవరనేది మూవీ రిలీజ్ దాకా సస్పెన్స్‌గా ఉంచబోతున్నారని టాక్. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ ముగిసిన తర్వాత త్రివిక్రమ్- ఎన్టీఆర్ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
This post was last modified on April 29, 2020 8:21 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…