మాస్ హీరో గోపిచంద్ ఇటీవల విశ్వం సినిమాతో మరో చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. అప్పుడెప్పుడో ‘లౌక్యం’తో కమర్షియల్ గా సక్సెస్ అందుకున్న గోపి ఇప్పటివరకు సూపర్ హిట్ చూడలేదు, ‘పక్కా కమర్షియల్’, ‘రామబాణం,’ ‘భీమా,’ ‘విశ్వం’ వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో ఆ ప్రభావం మార్కెట్ పై పడింది. గోపీచంద్ ఇప్పుడు ఒక పవర్ఫుల్ హిట్టు కొట్టాల్సిన అవసరం ఉంది. లైనప్ లో జిల్, రాదేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ ఉన్నాడు.
అలాగే మరో న్యూ డైరెక్టర్ తో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇక ఎప్పటి నుంచో గోపిచంద్ ఒక తమిళ కమర్షియల్ డైరెక్టర్ తో సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. అతను మరెవరో కాదు. కోలీవుడ్ డైరెక్టర్ శివ. అజిత్‌తో వరుసగా మాస్ కమర్షియల్ సక్సెస్‌లు సాధించిన శివ, త్వరలో విడుదల కానున్న ‘కంగువా’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అజిత్ తో శివ తీసిన సినిమాలు రొటీన్ ఫార్మాట్ లోనే వచ్చినప్పటికీ బాక్సాఫీస్ పరంగా అన్ని హిట్టు భోమ్మలే.
ఇక గోపీచంద్‌కు శివతో మంచి అనుబంధం ఉంది. నేనున్నాను, బాస్ వంటి సినిమాలకి కెమెరామెన్ గా వర్క్ చేసిన శివ.. గోపీచంద్ ‘శౌర్యం’ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అనంతరం ఈ ఇద్దరూ కలిసి ‘శంఖం’ సినిమా చేశారు, ఇది కూడా పర్వాలేదు అనేలా టాక్ తెచ్చుకుంది. శివ తరువాత రవితేజతో ‘దరువు’ సినిమాను తెరకెక్కించినా అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దర్శకుడిగా మొదటి ఛాన్స్ ఇచ్చిన గోపిచంద్ పైన కృతజ్ఞత తనకు ఎప్పటికీ ఉంటుందని శివ కంగువా ప్రమోషన్ లో కూడా చెబుతున్నాడు.
అలాగే గోపిచంద్ గారితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు చెప్పాడు. టైమ్ కుదిరినప్పుడు తప్పకుండా మా కాంబినేషన్లో సినిమా ఉంటుందని ఒక క్లారిటి అయితే ఇచ్చాడు. కానీ శివ కంగువాతో బిగ్ హిట్ అందుకుంటే గోపిచంద్ తో చేస్తాడా లేదా అనేది అసలు ప్రశ్న. అసలే 1000 కోట్ల టార్గెట్ అంటున్నారు. హిట్ అందుకుంటే పాన్ ఇండియా హీరోల ఫోకస్ అతనిపై పడే అవకాశం ఉంది. మరి టైర్ 2కి అటు ఇటుగా ఉండే మార్కెట్ తో కొనసాగుతున్న గోపి కోసం అతను ఓ మెట్టు దిగుతాడో లేదో చూడాలి.
This post was last modified on November 1, 2024 10:38 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…