బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్లతో నటించి స్టార్ స్టేటస్ సంపాదించిన శ్రీలంక అమ్మాయి జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. కొన్నేళ్ల కిందట ఓ వివాదంతో కెరీర్‌ను బాగా దెబ్బ తీసుకుంది. సుఖేష్ చంద్రశేఖర్ అనే క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తితో ఆమె ప్రేమలో పడడం.. తన నుంచి ఖరీదైన గిఫ్టులు పొందడం.. ఒక కేసులో సుఖేష్ జైలు పాలయ్యాక అతడితో ఆమె ప్రైవేటు ఫొటోలు బయటికి రావడంతో జాక్వెలిన్‌కు ఇబ్బందులు తప్పలేదు. అక్కడ్నుంచే తన కెరీర్‌లో డౌన్ ఫాల్ మొదలైంది. సుఖేష్‌కు వ్యతిరేకంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన జాక్వెలిన్.. అతను తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని, తన కెరీర్‌ను నాశనం చేశాడని పేర్కొంది. జాక్వెలిన్ అయితే అతడికి దూరమైందన్నది స్పష్టం.
కానీ జాక్వెలిన్‌కు తనకు టాటా చెప్పిన కొన్నేళ్ల తర్వాత కూడా సుఖేష్ ఆమె మీద ప్రేమను చంపుకోలేదు. ఫ్రాడ్ కేసులో బెయిల్ మీద ఉన్న సుఖేష్.. జాక్వెలిన్‌కు దీపావళి సందేశం పంపాడు. వనవాసాన్ని పూర్తి చేసుకుని త్వరలోనే వస్తానంటూ పేర్కొన్నాడు. “బేబీ మన ప్రేమకథ దేనికీ తక్కువ కాదు. వనవాసాన్ని పూర్తి చేసుకుని త్వరలోనే వస్తాను” అని పేర్కొన్న సుఖేష్.. ఇటీవలి జాక్వెలిన్ పారిస్ టూర్‌ను ఉద్దేశించి కూడా మాట్లాడాడు. “పారిస్ టూర్ ఫొటోలు బాగున్నాయి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను పిచ్చివాడినని ప్రపంచం అనుకోవచ్చు. కానీ మన మధ్య ఏముందో ప్రపంచానికి తెలుసు. మన ప్రేమకథ ప్రపంచానికి ఒక ఉదాహరణ కావాలి” అని అతను వ్యాఖ్యానించాడు.
జాక్వెలిన్ లేటెస్ట్ ఆల్బం ‘స్మార్ట్ రైడర్’ను ఎక్కువసార్లు విన్నవాళ్లకు థార్, ఐఫోన్ 16 లాంటి ఖరీదైన గిఫ్ట్ ఇస్తానని సుఖేష్ ప్రకటించడం గమనార్హం. సుఖేష్‌కు యుక్త వయసు నుంచే నేర ప్రవృత్తి ఉంది. తనను తాను లా సెక్రటరీ అనూప్ కుమార్‌గా పరిచయం చేసుకుని అతను అనేక మోసాలు చేశాడు. జాక్వెలిన్‌కు కూడా ఆ పేరుతోనే పరిచయమై, ఖరీదైన గిఫ్టులు ఇచ్చి దగ్గరయ్యాడు. ర్యాన్ బాక్సీ మాజీ యజమాని శివీందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానంటూ ఆయన భార్య నుంచి రూ.200 కోట్లు వసూలు చేయడం.. తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుఖేష్ మోసం బయటికి వచ్చింది.
This post was last modified on October 31, 2024 7:01 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…