‘బాహుబలి’…భారతీయ చలన చిత్రసీమలో ఓ అద్భుతం… బాక్సాఫీస్ వసూళ్లల్లో కనివినీ ఎరగని అ‘ద్వితీయ’ చరిత్ర సృష్టించిన ఓ రికార్డుల పుస్తకం. ఈ మూవీ విడుదలై నేటి మూడేళ్లు పూర్తయినా… ‘బాహుబలి- ది కంక్లూజన్’ క్రియేట్ చేసిన ఎన్నో రికార్డులు, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉన్న బాలీవుడ్ హీరోలు కూడా టచ్ చేయలేకపోయారు. ‘బాహుబలి-2’ హిందీ డబ్బింగ్ వెర్షన్, బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డులన్నింటినీ, రెబల్ స్టార్ ప్రభాస్ పేరిట లిఖించింది.
విడుదలైన రెండో రోజున 50 కోట్ల రూపాయల వసూళ్లను దాటిన ‘బాహుబలి’ హిందీ డబ్బింగ్ వెర్షన్… మూడో రోజు రూ. వంద కోట్లు, నాలుగో రోజు రూ.150 కోట్లు… ఆరో రోజు రూ.200 కోట్లు… ఎనిమిదో రోజు రూ.250 కోట్లు, 10వ రోజు రూ.300 కోట్లు, 12వ రోజు రూ.350 కోట్లు, 15వ రోజు రూ.400 కోట్లు, 20వ రోజు రూ.450 కోట్లు, 24వ రోజు రూ.475 కోట్లు, 34వ రోజు రూ.500 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత బీటౌన్‌లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ ఖాన్ త్రయం సినిమాలు ఎన్నో విడుదలయ్యాయి.
‘బాహుబలి’ రికార్డులు ఇట్టే ఊదేస్తానంటూ సల్మాన్ ఖాన్ తీసిన ‘ట్యూబ్‌లైట్’ వెలగకుండానే, మాడిపోగా… అమీర్ ఖాన్, అమితాబ్ వంటి బాలీవుడ్ స్టార్లు నటించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో మూడేళ్లుగా ఓ డబ్బింగ్ సినిమాగా ‘బాహుబలి’ క్రియేట్ చేసిన రికార్డులు… బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్లు భవిష్యత్తులో వెయ్యి కోట్ల వసూళ్లు సాధించే సినిమాలు తీయొచ్చేమో కానీ ఇంత తక్కువ సమయంలో ఈ రేంజ్ కలెక్షన్లు సృష్టించడం మాత్రం ఏ హిందీ హీరో వల్ల కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్, క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్, గత ఏడాది ‘సాహో’తో బాలీవుడ్ నుంచి భారీ వసూళ్లు రాబట్టాడు. పెద్దగా కంటెంట్ లేదని విమర్శలు వచ్చిన ‘సాహో’తోనే దాదాపు రూ.400 కోట్ల వసూళ్లు సాధించాడు. దీంతో ప్రభాస్ ‘బాహుబలి’ రికార్డులు కొట్టాలంటే మళ్లీ ప్రభాస్ మూవీ వల్లే సాధ్యమని కొందరు అంటుంటే, ‘ఆర్ఆర్ఆర్’తో ఈ రికార్డులను దర్శకధీరుడు రాజమౌళి తిరగరాస్తాడని మరికొందరి వాదన.
This post was last modified on April 28, 2020 4:10 pm
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…