తెలుగు టాక్ షోల్లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసే అన్ స్టాపబుల్ చాలా స్పెషల్. అందులో చాలామంది అతిథులతో ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్పించాడు బాలయ్య. ఇప్పుడు ఆయన షోలోకి విశిష్ట అతిథులు వచ్చారు. తెలుగు వారికి చేరువైన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో పాటు అతడితో లక్కీ భాస్కర్ సినిమా తీసిన వెంకీ అట్లూరి, నాగవంశీ, కథానాయికగా నటించిన మీనాక్షి చౌదరి లేటెస్ట్‌గా ఈ షోకు గెస్టులుగా వచ్చారు.
దీపావళి కానుకగా రాబోతున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమోను తాజాగా లాంచ్ చేశారు. అది దీపావళి టపాసుల్లాగే పేలింది. ఎపిసోడ్లో హైలైట్లతో ప్రోమో కూడా చాలా షార్ప్‌గా కట్ చేశారు. ఈ మధ్య ఇంటర్వ్యూల్లో సంచలన కామెంట్లతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన నిర్మాత నాగవంశీ కామెంట్లే ఈ ఎపిసోడ్‌కు ఆకర్షణగా మారేలా కనిపిస్తున్నాయి.
బాలయ్య ఈ ఎపిసోడ్లో అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు నాగవంశీ. నీకు నచ్చని డ్రెస్సింగ్ స్టైల్ గురించి చెప్పమని అడిగితే.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అప్పుడప్పుడూ ఒక పింక్ ప్యాంట్ వేస్తారని.. అది వద్దు అని రాజుకు చెప్పాలని అనుకుంటున్నట్లు నాగవంశీ కామెంట్ చేయడం విశేషం. మరోవైపు వెంకీ అట్లూరి పని చేయాలని ఆశపడే హీరోయిన్ ఎవరు అని అడిగితే.. ఎప్పట్నుంచో పూజా హెగ్డే మీద మనోడికి కన్ను ఉందంటూ మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నాగవంశీ.
ఇక సినిమా సినిమాకూ పారితోషకం పెంచేస్తున్నాడని మీరు ఫీలయ్యే హీరో ఎవరు అని అడిగితే.. తన మనసులో ఒకరు ఉన్నారంటూ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ జవాబు చెప్పే ప్రయత్నం చేశాడు నాగవంశీ. ఫుల్ ఎపిసోడ్ మీద ఆసక్తి పెంచేలా ఈ ప్రశ్నలు, సమాధానాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. మరోవైపు దుల్కర్ సల్మాన్‌తో బాలయ్య చిట్ చాట్, మీనాక్షితో సరదా కామెంట్లు, వెంకీ అట్లూరి మీద కౌంటర్లతో ఎపిసోడ్ చాలా హుషారుగా సాగినట్లే కనిపిస్తోంది. ఈ నెల 31న రాత్రి ఈ ఎపిసోడ్ ఆహాలో ప్రసాదరం అవుతుంది.
This post was last modified on October 30, 2024 9:54 am
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్‌లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…
తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్లో టాలీవుడ్ సృష్టించిన…
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…