మాములుగా రాజకీయాల్లో పరస్పరం బురద చల్లుకుంటూ ప్రత్యర్థిని బలహీనపరిచే సంఘటనలు ఎన్నికల టైంలో ఆ తర్వాత కూడా చూస్తూనే ఉంటాం. దీనికి బాలీవుడ్ మినహాయింపు కాదు. తమకు పోటీగా వస్తున్న సినిమాను దెబ్బ తీసేందుకు ఏమేం చేయాలో అంతా చేసి నెటిజెన్ల మధ్య హాట్ టాపిక్ గా మారుతున్నారు. వివరాల్లోకి వెళ్తే నవంబర్ 1 ఒకేరోజు విడుదల కాబోతున్న సింగం అగైన్, భూల్ భులయ్యా 3 మధ్య థియేటర్ల పంపకాల గురించి ఎంత వివాదం జరిగిందో చూశాం. అనిల్ తదాని ఏకంగా తన డిస్ట్రిబ్యూషన్ ద్వారా వస్తున్న భూల్ భూలయ్యా 3 వేసుకుంటే పుష్ప 2 ముప్పై అడుగుల కటవుట్ ఇస్తానని ఆఫర్ చేశారు.
ఇదిలా ఉంచితే ఇదింకో రూపం తీసుకుంది. సింగం అగైన్ టైటిల్ ట్రాక్ ని కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ కంపోజ్ చేశారు. మొదటి పదిహేను సెకండ్లతో పాటు అక్కడక్కడా సింగం ఒరిజినల్ పాటలోని సిగ్నేచర్ ట్యూన్ వాడుకున్నారు. దీంతో భూల్ భులాయ్యా 3 నిర్మాణ సంస్థయి టి సిరీస్ దానికి కాపీ రైట్ స్ట్రైక్ వేయించింది. దీంతో కొంత సమయం యూట్యూబ్ నుంచి సాంగ్ తీసేయాల్సి వచ్చింది. సింగం 1 మ్యూజిక్ హక్కులు ఈ కంపెనీ వద్ద ఉండటమే దానికి కారణం. ఊరికే ఉంటే ఏ గొడవా ఉండేది కాదు కానీ ఉద్దేశపూర్వకంగా ఇలా చేయడం పట్ల అజయ్ దేవగన్ కం సింగం ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
స్క్రీన్ల పంచాయితీ సైతం అతి కష్టం మీద కొలిక్కి వచ్చింది. సింగల్ థియేటర్లు సగం షోలు చెరో సినిమాకు సమానంగా పంచేలా అగ్రిమెంట్ చేసుకున్నారు కానీ భూల్ భులయ్యా 3కే ఎక్కువ వచ్చాయనే కామెంట్ ట్రేడ్ లో వినిపిస్తోంది. దీనికి పివిఆర్ ఐనాక్స్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్ నర్ గా ఉండటం మల్టీప్లెక్సుల విషయంలోనూ ఉపయోగపడుతోంది. గతంలో గదర్, లగాన్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ ఒకే రోజు రిలీజైనా రాని సమస్య ఇప్పుడు రెండు సీక్వెల్స్ మధ్య వస్తుండటం చూసి తలలు పండిన విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ఇది భవిష్యత్తులో ప్రమాద సూచికని హెచ్చరిస్తున్నారు.
This post was last modified on October 29, 2024 5:10 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…