అక్కినేని అభిమానులు అప్డేట్ అంటూ తపించిపోతున్న అక్కినేని అభిమానుల కోసం తండేల్ దర్శకుడు చందూ మొండేటి ఎట్టకేలకు కుండ బద్దలు కొట్టేశారు. వేరే సినిమా ట్రైలర్ లాంఛ్ కు అతిథిగా విచ్చేసిన సందర్భంగా ఈ ప్రశ్న ఎదురు కావడంతో సమాధానం చెప్పాడు. డిసెంబర్ కు ఫస్ట్ కాపీ సిద్ధం చేయడం సాధ్యం కాదని, అందుకే క్రిస్మస్ ఆప్షన్ పెట్టుకోలేదని క్లారిటీ ఇచ్చాడు. జనవరి కంతా మొత్తం పూర్తవుతుందని, కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం అల్లు అరవింద్ ఆలోచించినా, మేనమామ వెంకటేష్ కోసం నాగచైతన్య వద్దనుకున్నా సంక్రాంతి నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని హింట్ ఇచ్చాడు.
సో దీన్ని బట్టి చూస్తే ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని అర్థమవుతోంది. నిజానికి సంక్రాంతి చాలా మంచి ఆప్షన్ అయినప్పటికీ స్వయానా మేనల్లుడి సినిమా బరిలో ఉండగా తండేల్ దింపడం గురించి అల్లు అరవింద్ ఖచ్చితంగా ఆలోచిస్తారు. పైగా పోటీలో వెంకటేష్, బాలకృష్ణ, అజిత్ లాంటి అగ్ర హీరోలు ఉన్నప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. తండేల్ మీద చాలా బడ్జెట్ పెట్టారు. చైతు కెరీర్ లోనే అత్యధిక ఖర్చు డిమాండ్ చేసిన సబ్జెక్టు ఇది. అలాంటిది ఏదో తొందరపడి పోటీకి వెళ్తే ఓపెనింగ్స్ ప్రభావితం చెందే అవకాశం ఉంది. అందుకే సోలోగా రావడం తండేల్ కు చాలా ముఖ్యం.
జనవరి చివరి వారం కూడా చందూ మొండేటి ఖరారు చేయడం లేదు. ఇంకో పది రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలన్స్ ఉందని చెప్పడం చూస్తే అమరన్ ప్రమోషన్ల కోసం బిజీగా ఉన్న సాయిపల్లవి కోసమే ఈ బ్రేకని అర్థమవుతోంది. పైగా చైతు కూడా ఎంగేజ్మెంట్, ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఫంక్షన్ అంటూ బిజీగా ఉన్నాడు. ఇండియా పాకిస్థాన్ నేపథ్యంలో రూపొందిన తండేల్ లో చైతన్య మొదటిసారి బెస్తవారి కుర్రాడిగా నటించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద కూడా భారీ అంచనాలున్నాయి. మరి చివరికి ఏం తెలుస్తారో తెలియడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on October 29, 2024 12:41 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…