నిన్న అక్కినేని నాగేశ్వరరావు స్మారక జాతీయ అవార్డు ప్రధానం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అమితాబ్ బచ్చన్ చేతుల మీద మెగాస్టార్ చిరంజీవికి ఈ పురస్కారం అందజేశారు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ తో పాటు మొత్తం కుటుంబ సభ్యులంతా హాజరు కాగా పలువురు ప్రముఖులు ఆకర్షణగా నిలిచారు. రామ్ చరణ్, వెంకటేష్, నాని, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, నాగ్ అశ్విన్, రాజేంద్రప్రసాద్, అశ్వినిదత్, రాఘవేంద్రరావు, బుచ్చిబాబు, బ్రహ్మానందం, కీరవాణి, రమా రాజమౌళి తదితరులు హాజరు కాగా మూడు గంటల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోయింది.
చిరు తల్లి అంజనాదేవి కాళ్లకు బిగ్ బి నమస్కారం చేయడంతో మొదలుపెట్టి అంత పెద్ద బాలీవుడ్ బాద్షా ఇకపై నన్ను తెలుగు పరిశ్రమలో భాగంగా చేసుకోండి అంటూ పిలుపు ఇవ్వడం దాకా ఎన్నో మెరుపులు చోటు చేసుకున్నాయి. చిరంజీవి తన తల్లి ఏఎన్ఆర్ కు ఎంత పెద్ద అభిమానో ఒక ఉదాహరణ పంచుకున్నారు. తాను గర్భంలో ఉన్నప్పుడు రోజులు మారాయి రిలీజయ్యిందని, చూడాలనే కోరిక ఆవిడ వెలిబుచ్చితే రిస్క్ అనిపించినా నాన్న జట్కా, బస్సు ద్వారా పాలకొల్లు తీసుకెళ్లి మరీ చూపించిన జ్ఞాపకాన్ని స్టేజి మీద పంచుకున్నారు. అక్కినేని గొప్పదనాన్ని తన మాటల్లో వినిపించి ఆకట్టుకున్నారు.
నాగార్జున మాట్లాడుతూ కెరీర్ మొదలుపెట్టే ముందు ఓ సందర్భంలో స్టూడియోలో చిరంజీవి సినిమా షూటింగ్ కి నాన్న చెప్పి మరీ పంపించారని, అక్కడ అయనతో పాటు రాధ చేస్తున్న వాన పాట డాన్సు చూశాక వేరే దారి చూసుకుందామనిపించిందని అప్పటి ఫ్లాష్ బ్యాక్ నెమరు వేసుకున్నారు. ఏబిసి అఫ్ ఇండియన్ సినిమా అంటూ అమితాబ్ బచ్చన్, చిరంజీవికి కొత్త నిర్వచనం ఇవ్వడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత శతజయంతి సందర్భంగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుని పునరుద్ధరించిన అక్కినేని కుటుంబం ఇకపై దీన్ని కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.
This post was last modified on October 29, 2024 10:27 am
వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పదవి చేపట్టాక విడుదలవుతున్న మొదటి సినిమా ఇప్పటికైతే హరిహర వీరమల్లునే. ఇందులో అనుమానం…
తెలుగు దర్శకులు హిందీలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, మురళీమోహనరావు లాంటి సీనియర్లు ఎప్పుడో బాలీవుడ్లో సినిమాలు తీశారు.…
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందంటూ విపక్షాలు ఆరోపిస్తున్న మాటల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఒక్క పోలవరం…
ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి…
ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…